‘దసరా’ మూవీతో బ్లాక్ బష్టర్ హిట్ అందుకున్న నాని ‘హాయ్ నాన్న’ మూవీతో తన హిట్ ట్రాక్ ను కొనసాగించాడు. ఈ నేచురల్ స్టార్ నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ మూవీ ఆగష్టు 29న విడుదల కాబోతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ పై అంచనాలు ఉన్నాయి. ఈసినిమా తరువాత నాని నటించవలసిన రెండు సినిమాలు ఇప్పుడు క్యాన్సిల్ అయినట్లుగా వస్తున్న వార్తలు వస్తున్నాయి.  తెలుస్తున్న సమాచారం మేరకు నాని ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన  సుజిత్ డైరెక్షన్ లోని మూవీని అదేవిధంగా బలగం వేణుతో తీయవలసిన మూవీని పక్కకు పెట్టినట్లు సమాచారం. ఈ రెండు సినిమాలకి సంబంధించిన స్క్రిప్ట్ నానికి సంతృప్తి చెందలేక పోవడంతో ఈ నిర్ణయం అతడు తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాల స్తానంలో నాని మరో రెండు సినిమాలకు లైన్ క్లియర్ చేశాడు అన్న సంకేతాలు వస్తున్నాయి.వాటిలో మొదటిది ‘హిట్ 3’ అని అంటున్నారు. ఈసినిమాకు సంబంధించిన కథాను దర్శకుడు శైలేష్ కొలను పూర్తి చేయడంతో నాని నటించవలసిన సినిమాల లైనప్ లో మార్పు వచ్చింది అని అంటున్నారు. ఈసినిమాతో పాటుగా దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల చెప్పిన కథ నానికి బాగా నచ్చడంతో ఈమూవీ ప్రాజెక్ట్ ముందుకు వచ్చింది అని అంటున్నారు.కనీసం సంవత్సరానికి రెండు సినిమాలు తన వైపు ఉండేలా కు నాని యాక్షన్ ప్లాన్ అంటున్నారు. సంవత్సరానికి ఖచ్చితంగా తన వైపు నుండి రెండు సినిమాలు ఉండేలా నాని యాక్షన్ ప్లాన్ కొనసాగుతోంది. ఒక వైపు టాప్ యంగ్ హీరోలు సంవత్సరానికి ఒక్క సినిమా కూడ పూర్తి చేయలేని స్థితిలో కొనసాగుతూ ఉంటే నాని మాత్రం తన వైపు నుండి రెండు సినిమాలు సంవత్సరానికి ఉండేలా పక్కా ప్లాన్ తో కొనసాగుతున్నాడు. అయితే రెండు వందల కోట్ల కలక్షన్స్ హీరోగా నాని ఇప్పటికీ మారలేని పరిస్థితులలో ఈ కొత్త యాక్షన్ ప్లాన్ ఎంతవరకు నానీకి అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది చూడాలి..    మరింత సమాచారం తెలుసుకోండి: