కొట్టాలి.. కప్పు కొట్టాలి అనే కసిని ఎట్టకేలకు నెరవేర్చుకున్నాడు అమర్ దీప్. నీతోనే డాన్స్ సీజన్ 1, బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్స్ వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి అమర్ దీప్‌కి. అయితే పట్టు వదలని విక్రమార్కుడిలా టైటిల్ కొట్టి తీరాల్సిందే అని పట్టుపట్టిన అమర్ దీప్.. తన భార్య తేజస్వినితో కలిసి టైటిల్ కొట్టాడు. ‘నీతోనే డాన్స్ 2.0’ విజేతగా అవతరించాడు.మొత్తం 13 వారాల పాటు.. 12 మంది జంటల మధ్య హోరా హోరీగా సాగిన ఈ పోటీలో అమర్ దీప్-తేజూ జంట.. ట్రోఫీని కైవసం చేసుకుంది.నిజానికి నీతోనే డాన్స్ ఫస్ట్ సీజన్‌లో అమర్ దీప్- తేజులు విజేతలు కావాల్సి ఉండగా.. చివరి క్షణంలో ఈ జంటకి హ్యాండ్ ఇచ్చి సందీప్-జ్యోతిలను విజేతలుగా ప్రకటించారు. ఆ తరువాత ‘నీతోనే డాన్స్’ నుంచి నేరుగా బిగ్ బాస్‌ సీజన్ 7లోకి వెళ్లిన అమర్ దీప్‌ టైటిల్ సాధిస్తాడనే అనుకున్నారు. కానీ పల్లవి ప్రశాంత్ రైతు సింపథీ డ్రామా ముందు అమర్ దీప్ తేలిపోయాడు. దీనికి తోడు శివాజీ.. ప్రశాంత్‌లు కలిసి అమర్ దీప్‌కి టైటిల్‌ని దూరం చేశారు. అయితే పట్టు వదలని విక్రమార్కుడిలా.. మళ్ళీ ‘నీతోనే డాన్స్ 2.0’లోకి జంటగా వచ్చిన అమర్ దీప్.. తన భార్య తేజూ సాయంతో ఎట్టకేలకు కప్పు కొట్టాలనే కోరికను తీర్చుకున్నాడు.సెమీ ఫైనల్‌లో మొత్తం ఆరు జంటలు పోటీ పడగా.. వీరిలో సంధ్య-బ్రిట్టో జంట సెమీస్‌లో ఎలిమినేట్ అయ్యారు. దాంతో మిగిలిన ఐదు జంటలు.. విశ్వ- వాసంతి, మానస్- భానుశ్రీ, అమర్ దీప్ - తేజూ, వాసంతి- యావర్, అక్షిత- నితిన్‌లు గ్రాండ్ ఫినాలేకి చేరుకున్నారు.సెమీస్‌లో ఉత్తమ ప్రతిభ చూపించిన అమర్ దీప్ - తేజూ‌లు శని, ఆదివారాల పెర్ఫామెన్స్‌లో 200 మార్కులకు గారూ.. 200 సాధించి బెస్ట్ జోడీగా నిలిచారు.

ఇక ఫినాలేలో.. ఒక్కో జడ్జీకి యాభై మార్కుల చెప్పున మొత్తం ముగ్గురు జడ్జీలకు తలో యాభై మార్కులను కేటాయించారు. అయితే ముగ్గురు జడ్జీలు ఏకాభిప్రాయంతో.. అమర్ దీప్ - తేజస్విలకు అత్యధిక మార్కుల్ని ఇవ్వడంతో.. ‘నీతోనే డాన్స్ 2.0’ విజేతలుగా నిలిచారు.కాగా.. అమర్ దీప్-తేజూలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇచ్చి విజేతలు కావడం విశేషం. అయితే ఇక్కడే చాలామంది ఆడియన్స్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్లకి ట్రోఫీ ఎలా ఇస్తారని.. అయినా అమర్ - తేజూ జోడీ కంటే మానస్-భాను శ్రీ, విశ్వ-నయని పావనిలు బాగా చేశారు. వాళ్లలో విజేతల్ని ప్రకటిస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. అయితే స్టార్ మా షో అంటే ఆడియన్స్ తీర్పుకి వ్యతిరేకంగా ఉంటుందనేది ఎన్నాళ్ల నుంచో వస్తున్న సాంప్రదాయం. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అయ్యి ఉంటుంది. ఇందులో ఆశ్చర్యం ఏముంది కానీ.. మొత్తానికి ఎలాగైతే అమర్ పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. నీతోనే డాన్స్ 2.0 విజేతగా ట్రోఫీ అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: