ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్ ఎవరు అనే చర్చ వచ్చినప్పుడల్లా జానీ మాస్టర్ పేరు మొదటి వరుసలోనే వినిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ అనే షోలో కంటెస్టెంట్ గా చేయడం ద్వారా ప్రస్తానాన్ని మొదలుపెట్టిన జానీ మాస్టర్ ఇక డాన్స్ మాస్టర్గా అవతారం ఎత్తి తిరుగులేని సక్సెస్ ని సాధించారు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు బ్యాక్ డాన్సర్ గా కనిపించిన జానీ ఇక ఇప్పుడు ఎంతోమంది స్టార్ హీరోలకు అద్భుతమైన డాన్స్ పర్ఫామెన్స్ లను కొరియోగ్రఫీ చేస్తూ భారీగానే పాపులారిటీ సంపాదించుకున్నాడు.


 జానీ మాస్టర్ ఒక పాటకి కొరియోగ్రఫీ చేస్తున్నాడు అంటే అందులో డాన్స్ యువతకు కిక్ ఎక్కించే విధంగానే ఉంటుంది అని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. ఇలా జానీ మాస్టర్ కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే అతన్ని ఒక వివాదం చుట్టుముట్టింది. అతని దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన ఒక అమ్మాయి జానీ మాస్టర్ పై ఏకంగా రేప్ కేస్ పెట్టింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయం ఇండస్ట్రీలో సంచలనంగా మారిపోయింది. అయితే ఇక ఈ కేసులో జైలుకు వెళ్లిన జానీ మాస్టర్ ఇటీవల బెయిల్ పై బయటకి వచ్చారు. కానీ ఒకప్పటిలా మాత్రం అవకాశాలను దక్కించుకోలేకపోతున్నాడు.


 అయితే ఇటీవల స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి బిగ్ షాక్ తగిలిందని తెలుగు ఫిలిం డాన్సర్ అసోసియేషన్ నుంచి ఆయన కార్డును రద్దు చేయడమే కాదు శాశ్వతంగా సభ్యత్వాన్ని తొలగించారంటూ వార్తలు సంచలనంగా మారిపోయాయి. అయితే ఈ వార్తలపై కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ స్పందించారు. అదంతా ఫేక్ అంటూ చెప్పేశారు. తనపై తప్పుడు ప్రచారం చేయొద్దు అంటూ సందేశంలో కోరారు. తన పదవీకాలం ముగియకుండానే నిన్న అధ్యక్ష ఎన్నికలు ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపిన జానీ.. దీనిపై న్యాయపరంగా పోరాడుతాను అంటూ తెలిపారు. త్వరలో గేమ్ చేంజర్ సినిమాలోని ఒక మంచి పాటతో మీ ముందుకు వస్తాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక త్వరలోనే అన్ని వివరాలను వెల్లడిస్తాను అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: