సాధారణంగా ప్రతివారం బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయితే.. ఇంకొన్ని సినిమాలు ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక ఫ్లాప్ గా మిగిలిపోతూ ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లేందుకు సినిమా తీయడం విషయంలో ఎంతలా అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారో.. ఆ సినిమాకు ప్రమోషన్స్ చేయడం విషయంలో కూడా మూవీ యూనిట్ అంతే జాగ్రత్తలు తీసుకుంటుందిసి. నిమా ప్రేక్షకుల్లోకి వెళ్లాలంటే కథ కథనం హీరో హీరోయిన్లు ఎంత ముఖ్యమో ఆ సినిమా టైటిల్ కూడా అంతే ముఖ్యమైన విషయం తెలిసిందే.


 ప్రేక్షకులకు నచ్చి మెచ్చే టైటిల్ను పెట్టాలని దర్శకుడు మాత్రం అనుకుంటూ ఉంటారు. ఈ విషయంలో ఎంతో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంటారు దర్శకు నిర్మాతలు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు టైటిల్స్ కొరత ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అందుకే కొన్ని కొన్ని సార్లు ఒక హీరో తన సినిమాకు వాడుకున్న టైటిల్ ని మరో సినిమాకు మరో హీరో వాడుకోవడం చూస్తూ ఉంటాం. కానీ ఒక సినిమాకు వాడిన టైటిల్ని 12 ఏళ్ల పాటు మరో సినిమాకు వాడకూడదు అని గతంలో నిర్మాతలు మండలి షరతు కూడా పెట్టింది. కొన్నిసార్లు మాత్రం ఈ షరతులను పట్టించుకోలేదు. అయితే నందమూరి బాలకృష్ణ, అప్పట్లో తెలుగు ప్రేక్షకుల సోగ్గాడిగా గుర్తింపును సంపాదించుకున్న శోభన్ బాబు ఒకే టైటిల్ తో సినిమాలు చేశారు.


 ఆ టైటిల్ ఏమిటో తెలుసా తల్లిదండ్రులు. 1970లో మొదట శోభన్ బాబు హీరోగా తల్లిదండ్రులు అనే టైటిల్ తో ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో శోభన్ బాబుకు జోడిగా చంద్రకళ నటించగా.  పెద్దగా అభిమానులను అలరించలేకపోయింది మూవీ. కేవలం యావరేజ్ టాక్ మాత్రమే సొంతం చేసుకుంది. ఆ తర్వాత 1991 లో బాలయ్య తల్లిదండ్రులు అనే టైటిల్ తోనే ఓ సినిమా చేసి ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. విజయశాంతి హీరోయిన్. ఇక ఈ సినిమా మాత్రం సూపర్ హిట్ అయింది. ఇలా ఒకే టైటిల్ తో ఇద్దరు స్టార్ హీరోలు సినిమా చేయగా.. ఒకటి మంచి విజయం సాధిస్తే ఇంకొకటి మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: