- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


లైలా సినిమా విశ్వక్సేన్ కెరీర్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిపోయింది. సినిమా పరిశ్రమంలో మినిమం గ్యారెంటీగా విశ్వక్ సినిమాలకు రిటర్న్స్ వస్తాయని నిర్మాతలు నమ్ముతారు. అందుకే విశ్వక్ సేన్‌ ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తున్నాడు. అయితే నటుడు పృథ్వీరాజ్ లైలా ఈవెంట్లో చేసిన రాజకీయ కామెంట్లు లైలాకు తీరని నష్టాన్ని మిగిల్చాయని చెప్పాలి. వైసీపీ సోషల్ మీడియా ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై భ‌గ్గుమంది. ఫైనల్లీ పృధ్విరాజ్ లెంపలేసుకున్న విశ్వక్ సారీ చెప్పిన ఫలితం లేదు .. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లైలా కోసం లేడీ గెటప్‌తో విశ్వక్‌సేన్‌ ప్రేక్షకులను మెప్పించాడు. తెరపై తన నటన గురించి పేరు పెట్టాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రగా ఉన్నా సరే ఈజీగా చేసేస్తాడు .. లైలా విజయం కోసం ఆయన తీవ్రంగా కష్టపడ్డాడు. రకరకాల ప్రమోషన్లతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ సమయంలో మార్కెట్లో పెద్ద సినిమా కూడా లేదు. ఈజీగా బాక్స్ ఆఫీస్ వద్ద లైలా సందడి ఉంటుందని అందరు అంచనా వేశారు.


కేవలం పృధ్విరాజ్ వ్యాఖ్యలతో నిర్మాతకు తీరని నష్టం మిగిల్చింది అని చెప్పాలి. ఫిబ్రవరి 14న విడుదలైన లైలా ఇప్పటివరకు కేవలం మూడు కోట్ల కలెక్షన్లు మాత్రమే రాబట్టింది. విశ్వ‌క్ సేన్ కెరీర్ లో అతి తక్కువ వసూలు సాధించిన సినిమా ఇదే కావటం విశేషం. నిర్మాతకు కూడా ఈ సినిమా భారీగా నష్టాన్ని తెచ్చిపెట్టింది. శని .. ఆదివారాలు అయినా సినిమా కోలుకుంటుందని అందరూ అనుకున్నారు .. కానీ చాలా చోట్ల వీకెండ్ లో కూడా షోలు రద్దు అయ్యాయి. నాన్ థియేటర్ల బిజినెస్ ద్వారా కొంతమేరకు లాస్ కవర్ చేసుకున్న .. నిర్మాతకు థియేటర్ల ద్వారా సుమారు 10 కోట్లకు పైగా నష్టం వచ్చినట్టు తెలుస్తోంది. లైలా నిర్మాత సాహు గార‌పాటీ సినిమాలు గురించి చూస్తే మజిలీ - భగవంత్ కేసరి లాంటి హిట్లర్ గుర్తింపు పొందారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో భారీ సినిమా నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: