
పవర్ స్టార్ ..మెగాస్టార్.. సూపర్ స్టార్ ..ఐకాన్ స్టార్ స్టైలిష్ స్టార్ అని హీరోయిన్స్ కి చాలా రేర్గా ఇలాంటి బిరుదులు వస్తూ ఉంటాయి. నయనతారను అందరూ లేడి సూపర్ స్టార్ అంటూ పొగిడేస్తూ ఉంటారు . అలానే పిలుస్తూ ఉంటారు . ఏదైనా అవార్డు ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా సినిమా అనౌన్స్మెంట్లో కానీ ఇదే విధంగా మేకర్స్ కూడా ఆమె పేరు ముందు లేడీ సూపర్ స్టార్ అంటూ పిలుస్తూ ఉంటారు . అయితే ఇకపై తనను అలా పిలవద్దు అంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేసింది నయనతార . ఈ మేరకు ఆమె ఏకంగా ప్రకటన కూడా విడుదల చేసింది .
"నన్ను చాలామంది అభిమానిస్తారు.. ఆ విషయం నాకు తెలుసు .. మీ అభిమానంతోనే లేడీ పవర్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు.. ఆ ట్యాగ్ నాకు అలానే వచ్చింది. మీ అందరి ప్రేమ అభిమానాలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాను . కానీ దయచేసి ప్లీజ్ నన్ను అలా పిలవద్దు నన్ను నయనతార అని మాత్రమే పిలవండి , నా మనసుకు దగ్గరైన పేరు నయనతార మాత్రమే , నయనతార అని పిలిస్తేనే నాకు ఇష్టం . ఓ నటి గానే కాకుండా ఓ వ్యక్తిగా కూడా అలా పిలిపించుకోవడమే నాకు చాలా చాలా ఇష్టం అంటూ క్లారిటీ ఇచ్చింది".
దీనితో సోషల్ మీడియాలో ఇప్పుడు నయనతార తీసుకున్న నిర్ణయం బాగా వైరల్ గా మారింది . నయనతార చాలా సింపుల్ గా ఉండడానికి ఇష్టపడుతుందని ఎంత ఎదిగినా కూడా ఆమె ఒదిగి ఉండడానికి ఇష్టపడుతుంది అని ..అందరూ హీరోయిన్స్ కూడా ఈమెను చూసి నేర్చుకుంటే ఇండస్ట్రీలో అసలు నెగిటివిటీ అనేది ఉండదు అంటూ నయనతార ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆమెను ప్రశంసిస్తూ పొగిడెస్తున్నారు . కానీ కొంతమంది మాత్రం గతంలో హీరోల సినిమాల ప్రమోషన్స్ విషయంలో నయనతార పెట్టిన షరతులను గుర్తు చేసుకుంటూ ఆమె పేరు పై నెగిటివ్ ట్రోలింగ్ చేస్తున్నారు..!