అల్లు అర్జున్ .. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకటే ట్రెండ్ అయిపోతున్న పేరు . దానికి కారణం పుష్ప2 సినిమా అని చెప్పుకోక తప్పదు . ఆఫ్కోర్స్ ఈ సినిమా అల్లు అర్జున్ కి కొంచెం ప్లస్ చేస్తే కొంచెం నెగిటివ్ గా కూడా మారింది. అయితే అల్లు అర్జున్ ఇప్పుడు నెక్స్ట్ ఏ డైరెక్టర్ దర్శకత్వం లో నటించబోతున్నాడు..? అంటూ చాలా చాలా చర్చలు మొదలయ్యాయి . కొందరు  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అంటుంటే మరికొందరు డైరెక్టర్ అట్లీ అంటున్నారు. కానీ పుష్ప2 సినిమా తర్వాత మరొకసారి అలాంటి హిట్ పడాలి అంటే అది పాన్ ఇండియా  ఫిలిం అయ్యే ఉండాలి .


కచ్చితంగా జనాలను ఎంటర్టైన్ చేసే సినిమా అయ్యే ఉండాలి అంటూ చెబుతున్నారు బన్నీ ఫ్యాన్స్. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సినిమాను హోల్డ్ లో పెట్టి మరి అట్లీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడట అల్లు అర్జున్ . అందుతున్న సమాచారం ప్రకారం ఉగాది రోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభించబోతున్నారట . ఈ సినిమాలో హీరోయిన్లుగా సమంత - జాన్వికపూర్ ని చూస్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.



అయితే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ చాలా తక్కువగా రెమ్యూనరేషన్ ఓకే చేశారట . పుష్ప సినిమా కోసం 150 కోట్లు తీసుకున్నాడు అంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమా కోసం కేవలం 80 కోట్లు మాత్రమే ఛార్జ్ చేశారట . ఎవరైనా కెరీయర్ ని పైకి ఎదగాలని కోరుకుంటారు. 10 కోట్లు తీసుకునే వాళ్ళు 20 కోట్లు.. 30 తీసుకునే వాళ్ళు 50 కోట్లు ఇలా తీసుకుంటారు. మరి అల్లు అర్జున్ వంద నుంచి 150 నుంచి ఇలా 80 కి పడిపోవడం ఏంటి..? అంటూ మాట్లాడుకుంటున్నారు . ఇలాగే సినిమాల రెమ్యూనరేషన్ తగ్గించుకుంటూ పోతే ఆయన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: