పోయిన సంవత్స రం నివేదా థామస్ ప్రధాన పాత్రలో 35 చిన్న కథ కాదు అనే సినిమా రూపొందిన విషయం మన అంద రికీ తెలిసిందే. నందకిషోర్ ఈమని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు . ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి మే కర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దానితో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి . అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు మంచి టాక్ ప్రేక్షకుల నుండి వచ్చింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

ఇకపోతే ఇలా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సూపర్ గా సక్సెస్ అయిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ మూవీ రీమేక్ కి సంబంధించిన పనులు ప్రారంభం అయినట్లు ఓ సంస్థ ఈ సినిమాను హిందీ లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో తెలుగులో హిట్ అయిన సినిమాలను హిందీలో రీమిక్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ అందులో హిట్ అయిన సినిమాల సంఖ్య మాత్రం అత్యంత తక్కువగా ఉంది.

ఇలాంటి సమయంలో ఈ సినిమాను హిందీ లో రీమిక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమా హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇకపోతే ఈ మూవీ లో నివేతా థామస్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ లోని నటనకు గాను నివేతా థామస్ కి మంచి ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల విమర్శకుల నుండి దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: