
గేమ్ చేంజర్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటించగా ... శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయింది. మొదటి రోజు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 92.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.
ఎంపురన్ : మోహన్ లాల్ హీరోగా రూపొందిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 67.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.
డాకు మహారాజ్ : బాలకృష్ణ హీరో గా రూపొందిన ఈ సినిమాకు బాబి కొల్లి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 51.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.
గుడ్ బ్యాడ్ అగ్లీ : తమిళ నటుడు అజిత్ కుమార్ హీరోగా రూపొందిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 51.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.
ఛావా : విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా రూపొందిన ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 47.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.