మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 2005 సంవత్సరంలో 'శ్రీ' సినిమాతో తెలుగు తెరకు ఈ చిన్నది ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ చిన్నది హ్యాపీ డేస్ సినిమాతో తన ఇమేజ్ ను అమాంతం పెంచేసుకుంది. ఈ సినిమాలో తన నటన, స్టైల్, అంద చందాలు చూసిన అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో తమన్నా నటనకు కుర్రాళ్ళ మతులు పోయాయి. ఈ సినిమా అనంతరం తమన్నా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా తన హవాను కొనసాగిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ తెగ సందడి చేస్తోంది. ఈ చిన్నది సినీ ఇండస్ట్రీకి పరిచయమై దాదాపు 20 ఏళ్లకు పైనే అవుతుంది. అయినప్పటికీ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. 

ఇప్పటివరకు తమన్నా తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. తెలుగు, హిందీ అనే తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ పోతోంది. ఇక తమన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా వరుసగా ఫోటోషూట్లు చేస్తూ తన అందమైన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకోగా... అవి క్షణాల్లోనే వైరల్ అవుతూ ఉంటాయి. ఈ చిన్నదాని అందానికి కోట్లాది సంఖ్యలో అభిమానులు ఉన్నారు.


 కాగా, తమన్నా తనకు సంబంధించి కొన్ని సంచలన విషయాలను షేర్ చేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో అందంగా ఉంటేనే సినిమా అవకాశాలు వస్తాయనడం తనకు అస్సలు నచ్చదని తమన్నా అన్నారు. అందంపై ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలి కానీ అందమే సినిమా అవకాశాలను తీసుకువస్తుందంటే నేను ఏమాత్రం నమ్మను అంటూ తమన్నా చెప్పారు. మిల్కీ బ్యూటీ ట్యాగ్ నాకు ఫ్యాన్స్ ఇచ్చారు. ఆ ట్యాగ్ ను మీడియా వాళ్ళు మరింత ప్రచారం చేశారు.

ఈ ట్యాగ్ వల్ల నాకు సినిమా అవకాశాలు ఏ మాత్రం పెరగలేదని, సినిమాల మీద ఎలాంటి ప్రభావం చూపలేదంటూ తమన్నా చెప్పుకొచ్చింది. కాగా, తమన్నా నటించిన ఓదెల-2 సినిమా ఈరోజు థియేటర్లలో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంటుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చేశారు. ఫైనల్ గా ఓదెల-2 సినిమా రిలీజ్ అయి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ప్రస్తుతం తమన్నా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక సినిమాతో తన అభిమానుల ముందుకు వస్తూనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: