తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఓ కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి శృతి హాసన్ కూడా ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుంది. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన పనులన్నింటినీ ఫుల్ స్పీడ్ గా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ లో శృతి హాసన్ తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్ ను స్టార్ట్ చేసింది. అందుకు సంబంధించిన ఓ పోస్ట్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ ప్రకారం శృతి హాసన్ డబ్బింగ్ థియేటర్లో తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటిస్తున్న మూవీ కావడం , అందులో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన నాగార్జున , శృతి హాసన్ లాంటి నటీ నటులు నటిస్తూ ఉండడం , ఆ మూవీ కి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తూ ఉండడం , అలాగే అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకులు అత్యంత భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకొని అద్భుతమైన విజయాన్ని అందుకుంటుందో లేదో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: