
కోలీవుడ్ సౌత్ స్టార్ హీరో సూర్య టాలీవుడ్ లో ఎప్పుడు మంచి సినిమా చేస్తారా ? అని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు .. ఇప్పుడు మొత్తాని కి ఆ సమయం రానే వచ్చేసింది .. ఈ క్రమం లోనేఏ దర్శకుడు వెంకీ అట్లూరీ తో సూర్య సినిమా చేయడానికి ఓకే చెప్పిన విషయం తెలిసిందే .. అయితే ఈ సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్ కోసం ఓ భారీ సెట్ ను రెడీ చేస్తున్నారు .. ఇక ఈ సెట్ లో జూన్ నుంచి రెండు వారాల పాటు యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కిస్తారట .. అలాగే ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ నేతృత్వం లో ఈ ఫైట్స్ షూటింగ్ జరుగుతుందట .. అలాగే ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమా మొత్తం లోనే హైలెట్ గా ఉంటుంద ని అంటున్నారు ..
అదే విధంగా వెంకీ అట్లూరి ఎలాంటి గెటప్ లు సందేశా లు ఏమీ లేకుండా ... ఓ చక్కని ఫ్యామిలీ లవ్ స్టోరీ ని వెంకీ , సూర్య కి చెప్పారు .. అలాగే ఈ సినిమా కు హీరోయిన్ గా ముందుగా భాగ్యశ్రీ భోర్సే ను తీసుకునే ఆలోచనలో ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి .. అయితే ఇప్పుడు ఈమె ప్లేస్లోకి గ్లామర్ క్వీన్ కాయదు లోహర్ ను తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది .. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమా ను నిర్మిస్తుండ గా .. మ్యూజిక్ సెన్సేషన్ జీవి ప్రకాష్ సంగీతద అందిస్తున్నారు .. అయితే ఇప్పుడు ఈ సినిమా ఏ రేంజ్ లోవిజయం అందికుంటుంది అనేది కాలమే సమాధానం చెప్పాలి .. ఎన్నో అంచనాలతో తీసిన కంగువా మూవీ కూడా పాన్ ఇండియ స్థాయిలో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది . ఇక మరి ఇప్పుడు రెట్రో సినిమాతో కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏంటో చూపించుకోవడానికి రెడీ అవుతున్నాడు .