ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కీలక నేతలలో వల్లభనేని వంశీ ఒకరు. వల్లభనేని వంశీ 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీ డీ పీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వై సీ పీ అభ్యర్థి దుట్టా రామచంద్రరావుపై 9400 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే గా అసెంబ్లీ కి ఎన్నికయ్యాడు. ఆయన 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీ డీ పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వై సీ పీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై 838 ఓట్ల మెజార్టీ తో రెండోసారి కూడా గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

వల్లభనేని వంశీ 2024 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో గన్నవరం నియోజకవర్గం వై ఎస్‌ ఆర్‌  సీ పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీ డీ పీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు పై 37,628 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఇలా వల్లభనేని వంశీ టి డి పి పార్టీ నుండి పోటీ చేసిన రెండు సార్లు కూడా అద్భుతమైన రీతిలో గెలుపొంది రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఇక ఆఖరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన వై సీ పీ పార్టీ నుండి పోటీ చేసి మొదటి సారి అపజయాన్ని అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా వల్లభనేని వంశీ కి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తెలుగు దేశం పార్టీ కార్యాలయం దాడి విషయంలో అది ఏ మాత్రం నా ప్రమేయం లేకుండా జరిగింది.

నన్ను ఒక సంతాపం కోసం పిలిచారు. చివరకు నన్నే ఆ కంప్లైంట్ లో చేర్చారు అని సత్య వర్ధన్ అనే అబ్బాయి ద్వారా ఒక పిటిషన్ను వేయించి , ఆ కేసు విత్డ్రాయిల్ కోసం వల్లభనేని వంశీ ప్రయత్నించాడు. ఇక 24 గంటలు కూడా తిరగకుండా వల్లభనేని వంశీ , ఆయనను కిడ్నాప్ చేశాడు అని సాక్షాదారాలతో అతని ఇంటి వద్దకు వెళ్లడంతో చివరగా కోర్టు వల్లభనేని వంశీ బెల్ ను రద్దు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: