టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన హీరోగా కెరియర్ను మొదలు పెట్టిన తర్వాత వరుస పేట్టి విజయాలను అందుకుంటు చాలా తక్కువ కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం విజయ్ దేవరకొండ ఆ స్థాయి విజయాలను అందుకోవడంలో చాలా వరకు వెనుకబడిపోయాడు. ఈ మధ్య కాలంలో విజయ్ నటించిన అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకున్నాయి.

ఆఖరుగా విజయ్ , పరుశురామ్ పేట్ల దర్శకత్వంలో రూపొందిన ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరో గా నటించాడు. మృనాల్ ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా ... జగపతి బాబు ఈ మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ కూడా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న కింగ్డమ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ కి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ కేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమాలో కేవలం మూడు పాటలు మాత్రమే ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అందులో ఒక పాటను వచ్చే వారం విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు , అన్ని ఓకే అయితే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ బృందం వారు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతానికి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ తో విజయ్ దేవరకొండ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd