టాలీవుడ్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన నటన, అందం, అభినయంతో ఈ ముద్దుగుమ్మ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. 'అలా ఎలా' అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత కుమారి 21 ఎఫ్ సినిమాతో తన అంద చందాలను ఆరబోసింది. ఈ సినిమాలో ఈ చిన్నదాని నటన, అందాల ఆరబోతను చూసి ప్రతి ఒక్క కుర్రాడు ఫిదా అయ్యాడు. అంతలా ఈ చిన్నది తన నటనతో ప్రేక్షకులను మైమరపించింది. ఈ చిన్న దానికి ఈ సినిమా అనంతరం వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఈడోరకం ఆడోరకం, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్, ఏంజెల్, 24 కిస్సెస్ లాంటి అనేక సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 

కానీ ఈ సినిమాలేవి ఈ చిన్నదానికి పెద్దగా సక్సెస్ తీసుకురాలేదు. అనంతరం ఈ చిన్నది ఓదెల రైల్వేస్టేషన్ సినిమాతో మరోసారి తెలుగు అభిమానుల మనసులను దోచుకుంది. ఈ సినిమాలో ఈ చిన్నదాని నటన, అందానికి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ఈ సినిమా అనంతరం ఈ చిన్నది తెలుగులో ఎలాంటి సినిమాలలో పెద్దగా నటించలేదు. కొన్ని సినిమాలలో నటించినప్పటికీ అవి ఏవి పెద్దగా సక్సెస్ సాధించలేవు. హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తన అందాలను ఆరబోస్తూ గ్లామర్ ఫోటోలను తన అభిమానులతో షేర్ చేసుకోగా....అవి విపరీతంగా వైరల్ అవుతాయి.

ప్రస్తుతం ఈ చిన్న దానికి తెలుగులో ఎలాంటి సినిమా ఆఫర్లు రావడం లేదు. నటన, అందం ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాక ఆ సినిమాల్లో అవకాశాలను అందుకోలేకపోతోంది. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం ఈ చిన్నదానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. హెబ్బా పటేల్ సినిమాలలో రాణిస్తున్న సమయంలో ఓ హీరోతో రొమాన్స్ చేసినట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపించింది. అంతేకాకుండా ఆ హీరోతో సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తూ ప్రేమాయణం కూడా నడిపిందట. ఆ హీరో మరెవరో కాదు రాజ్ తరుణ్. వీరిద్దరూ చాలా కాలం పాటు సీక్రెట్ గా వారి రిలేషన్ కొనసాగించారట. ఏమైందో తెలియదు కొద్ది రోజులకి వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ హెబ్బా పటేల్ కు సంబంధించి ఈ వార్త హాట్ టాపిక్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: