రజినీకాంత్ రాధిక కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. వీరిద్దరూ పోకిరి రాజా, రంగా, మంచి వాడికి మంచి వాడు, నండ్రి మీండు వరుగ వంటి ఎన్నో సినిమాలు వచ్చాయి. అలా తమిళ,తెలుగు సినిమాల్లో హిట్ కాంబో గా పేరు తెచ్చుకున్న నటినటులలో రాధికా, రజినీకాంత్ ల జోడి కూడా ఉంటుంది.అయితే అలాంటి రజినీకాంత్ వేసుకున్న చెప్పుల విషయంలో రాధిక ఓసారి అందరి ముందే అవమానించిందట.మరి ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం.. రజినీకాంత్ చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి ఎదిగారు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా చాలా సింపుల్ గా ఉంటారట.ఎక్కడికి వెళ్లినా కూడా అందరూ ఎలా ఉంటారో అలాగే అందరితో కలిసిపోయి మామూలు వేషధారణలోనే ఉంటారట.అలా ఓ రోజు రజినీకాంత్ ఓ ఫంక్షన్ కి వెళ్లారట. అయితే అదే ఫంక్షన్ కి రాధిక కూడా వచ్చిందట.

ఇక ఫంక్షన్ కి రజినీకాంత్ సింపుల్గా రబ్బరు చెప్పులు వేసుకొని వెళ్లారట.దాంతో రాధిక రజినీకాంత్ వేసుకున్న రబ్బరు చెప్పులు చూసి షాక్ అయిపోయి ఇదేంటి మీరు ఈ రబ్బర్ చెప్పులు వేసుకొని ఈ ఫంక్షన్ కి వచ్చారు అని అందరి ముందే అడిగిందట.ఇక రాధిక మాటలకు రజినీకాంత్ కాస్త అసహనంగా ఫీల్ అయ్యారట. ఇక ఆ తర్వాత నుండి రజినీకాంత్ ఎక్కడికి వెళ్ళినా కూడా రాధిక కోసమైనా సరే రబ్బర్ చెప్పులు వేసుకోకుండా చెప్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకునే వారట.అలా ఓరోజు రజినీకాంత్ కొచ్చాడియన్ సినిమా షూటింగ్ కోసం లండన్ వెళ్ళినప్పుడు అక్కడికి షూలు  వేసుకొని వచ్చారట.

అయితే ఆ టైంలో కూడా రాధిక రజినీకాంత్ షులు చూసి ఇదేంటి షూలు వేసుకొని వచ్చారంటే..మీరు ఈ షూటింగ్ సెట్ కి వచ్చారు కదా..అందుకే నేను కరెక్ట్ గా వేసుకున్నాను అంటూ బదులిచ్చారట. అలా రాధిక రజినీకాంత్ ని రబ్బర్ చెప్పులు వేసుకున్నామని ఎప్పుడైతే అందరి ముందు అడిగిందో అప్పటినుండి రజినీకాంత్ రాధిక ఉండే దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కూడా షూలు వేసుకొని వెళ్లేవారట. ఇక అమ్మాయిలు అందరిలో ముందుగా చూసేవి చెప్పులే అని మరోసారి రాధిక ని చూసి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అమ్మాయిలు ఎప్పుడైనా సరే ఎవర్ని చూసినా కూడా ముందుగా వారు వేసుకున్న చెప్పులనే చూస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి: