నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన హిట్ ది థర్డ్ కేస్ మూవీ ఈ రోజు అనగా మే 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ కొన్ని ప్రాంతాల్లో నిన్న రాత్రి నుండే ప్రదర్శించడం మొదలు పెట్టారు. దానితో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టాక్ కూడా బయట స్ప్రెడ్ అయిపోయింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి మంచి టాక్ లభిస్తుంది.

మూవీ లో భారీ రక్తపాత సన్నివేశాలు ఉన్నట్లు , అవి కాస్త మితిమీరిన విధం గానే ఉన్నట్లు దానితో , ఈ సినిమాను చిన్న పిల్లలతో , కుటుంబంతో కలిసి చూడడం కాస్త కష్టం అని , వీలైతే పెద్ద వయసు వ్యక్తులు మాత్రమే ఈ మూవీ ని కలిసి చూడడం మంచిది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఇక ఈ మూవీ లో నాని తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూసినట్లయితే ఈ సినిమా అదిరిపోయే రేంజ్ లో లేకపోయినా ప్రేక్షకులను మాత్రం బాగా ఆకట్టుకునే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ కి మంచి టాక్ వస్తూ ఉండడంతో ఈ మూవీ ద్వారా నాని కి మంచి విజయం దక్కే అవకాశం ఉన్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

నాని ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో అందుకుంటున్నాడు. నాని వరుసగా దసరా , హాయ్ నాన్న , సరిపోదా శనివారం సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇక తాజాగా విడుదల అయిన హిట్ ది థర్డ్ కేస్ మూవీ ద్వారా కూడా నానికి మంచి విజయం దక్కే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి నాని వరస విజల పరంపరను హిట్ ది థర్డ్ కేస్ మూవీతో కూడా కొనసాగిస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: