నాని.. సైలెంట్ కిల్లర్ నాని చాలా చాలా టాలెంటెడ్ . నానిలా మరి ఏ హీరో కూడా ఇలా చేయలేడు.  ప్రెసెంట్ ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి . అది ఎందుకో కూడా అందరికీ తెలుసు . తాజాగా నాని నటించిన హిట్ త్రీ సినిమా రిలీజ్ అయింది . ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా వామ్మో నాని లో ఇంత వైలెంట్ యాంగిల్ ఉందా..? అంటూ షాక్ అయిపోతున్నారు . ఇప్పటివరకు నాని అంటే సాఫ్ట్ హీరో .. రొమాంటిక్ హీరో .. ఫ్యామిలీ హీరో ఇలానే అనుకునేవారు నానిలో తెలియని క్రుయాలిటీ హీరో కూడా ఉన్నారు అంటూ ఈ సినిమానే బయటపెట్టింది .


కాగా  ఈ హిట్ 3 సినిమా చూసిన ప్రతి ఒక్కరు నానిని ఏ రేంజ్ లో పొగిడేస్తున్నారో.. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ లో మెరిసిన శ్రీనిధి శెట్టిని కూడా అంతే రేంజ్ లో పొగిడేస్తున్నారు. నిజానికి కెజీఎఫ్ తర్వాత శ్రీనిధికి ఎన్నో ఆఫర్స్ వచ్చినా కూడా అంత ఈజీగా ఆమె సినిమాలను ఓకే చేయలేదు . చాలా కాలం తర్వాత నాని సినిమాతో తెరపై కనిపించింది . కానీ ఆమె అందం విషయంలో నటన విషయంలో ఏం మాత్రం తగ్గలేదు . శ్రీనిధి తనదైన స్టైల్ లో ఈ సినిమాలో నటించి ఆకట్టుకుని  మెప్పించింది .



అయితే ఈ సినిమాల్లో ముందుగా శ్రీనిధి పాత్రలో హీరోయిన్ గా వేరే బ్యూటీని అనుకున్నారట. ఆమె మరి ఎవరో కాదు మృణాల్ ఠాకూర్.  మృణాల్ ని హీరోయిన్ గా అనుకున్నారట మేకర్స్. అయితే మృణాల్ ఠాకూర్ తో ఆల్రెడీ నాని హాయ్ నాన్న సినిమాలో నటించాడు అని..  మళ్లీ అదే విధంగా వాళ్ళ కాంబో రిపీట్ అయితే కొత్తదనం ఏముంటుంది అని యాక్షన్స్ సీన్స్ లో  మృణాల్ ఠాకూర్ పెద్దగా సూట్ కాకపోవచ్చు అంటూ నానినే సజెస్ట్  చేయడంతో ఆ తర్వాత చాలామంది హీరోయిన్స్ ని ఈ కథ కోసం అనుకున్నారట . ఆ తర్వాత మళ్లీ శ్రీనిధి  దగ్గరికి వచ్చి ఆగారట మూవీ టీం. సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా బాగా వైరల్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: