ఎక్కడైనా సరే.. ఒక మనిషి బాగుపడుతున్నారు అంటే తొక్కేయడానికి .. వెనక్కి లాగడానికి కాచుకుని కూర్చుని ఉంటారు జనాలు. అది అందరికి బాగా తెలిసిన విషయమే అయినా కొన్ని సార్లు అది జరిగిన్నప్పుడు మనిషిని ఇంకా బాధపెట్టేస్తూ ఉంటుంది. పైగా తెలుగు ఇండస్ట్రీలో అలాంటి వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు అంటూ జనాలు ఎప్పటినుంచో మాట్లాడుతూ వస్తున్నారు . కాగా  ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో హీరో నాని పేరు మారుమ్రోగి  పోతుంది.


దానికి కారణం హిట్ మూవీ అని చెప్పుకోక తప్పదు .  హిట్ 3 మూవీ సెన్సేషనల్ హిట్ గా మారిపోయింది.  ఇప్పుడు నానిని అందరు తెగ పొగిడేస్తున్నారు . అయితే ఇదే మూమెంట్లో నాని సినిమాకు సంబంధించి భారీ కుట్ర చేశారు అనే టాక్ కూడా వినిపిస్తుంది . సినిమా రిలీజ్ అయిన 24 గంటల లోపే సినిమాకి సంబంధించిన హై క్వాలిటీ ప్రింట్ లీక్ అయినట్లు సమాచారం అందుతుంది.  ఇది నానికి..  నాని ఫాన్స్ కి కోలుకోలేని షాక్ గా మిగిలిపోయింది . పైరసిని ఇండస్ట్రీ పట్టిపీడిస్తున్న విషయం అందరికి తెలిసిందే .



అయితే ఇప్పటివరకు చాలా పెద్ద పెద్ద స్టార్ హీరోలు నటించిన సినిమాలే ఇలా లీక్ అయి వైరల్ అయ్యాయి . కానీ నాని నటించిన సినిమా టోటల్ మూవీ ఇలా లీక్ అయిపోవడం ..అది కూడా హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ కావ్దం అది కూడా రిలీజ్ అయిన 24 గంటల్లోనే ఇలా జరగడం తీవ్ర కలకల రేపుతుంది . సినీ వర్గాలలో నాని అభిమానుల్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది . ఈ పైరసీ కారణంగా నాని హిట్ సినిమాకి ఏమైనా నెగిటివ్ రిజల్ట్ ఉంటుందా..? అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు . ఇలాంటి వాటి నుంచి చిత్ర పరిశ్రమను ప్రభుత్వమే ఏదో ఒక విధంగా కాపాడాలి అంటున్నారు సినీ పెద్దలు . గతంలో చరణ్ "గేమ్ చేంజర్" విషయంలో ఇలా లీక్ అయిన్నప్పుడు దీని వెనుక ఓ బిగ్ ప్రొడక్షన్ హౌస్ ఉంది అంటూ టాక్ వినిపించింది. ఇప్పుడు నాని సినిమా కూడా పూర్తిగా లీక్ అయిపోయింది. దీని వెనుక కూడా ఎవరైన పెద్ద వ్యక్తులు ఉన్నారా..? అనేది ఇప్పుడు గాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చూడాలి మరి గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: