మన తెలుగువారు తెలుగును అంతగా గౌరవించరు గాని తమిళులు వారి భాషను మరియు వారి మనుషులను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. ముఖ్యంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే తెలుగులో చాలామంది హీరోలు ఇతర ఇండస్ట్రీలకు చెందిన డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ ఉంటారు. అంతేకాదు ఇక్కడ డైరెక్టర్లు అక్కడి వాళ్లతో కూడా సినిమాలు చేస్తారు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి చాలామంది హీరోయిన్లు మన తెలుగు వారు కారు.. అలా ఇక్కడి వాళ్ళు అక్కడ, అక్కడి వాళ్ళు ఇక్కడ నటిస్తూ సినీ ఫీల్డ్ లో రాణిస్తున్నారు. అలాంటి ఈ తరుణంలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఈ డైరెక్టర్ ను మాత్రం వేరే భాషలో సినిమా చేస్తుంటే సైడ్ చేశారట. మా డైరెక్టర్ తో సినిమా చేస్తానని  నువ్వు వెళ్ళిపొమ్మని మొహం మీదే చెప్పారట. 

ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరయ్యా అంటే గోపీచంద్ మలినేని. ఆయన తాజాగా జాట్ అనే చిత్రం ద్వారా సూపర్ హిట్ అందుకున్నాడు. అలాంటి ఈ తరుణంలో ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తమిళ స్టార్ హీరో విజయ్ నన్ను ఒక సినిమా నుంచి తప్పించారని  షాకింగ్ కామెంట్స్ చేశాడు. బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమా తర్వాత ఆయనతో చేసే ఛాన్స్ వచ్చిందని, కథ మొత్తం విన్నాక ఓకే చెప్పాడని ఇక షూటింగ్ కు వెళ్దాం అనుకునే సమయానికి ఆయన పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చాడని చెప్పుకొచ్చాడు. ఇదే తరుణంలో తెలుగు డైరెక్టర్ తో సినిమా చేస్తే తమిళంలో వ్యతిరేకిస్తారని ఆ సినిమా నుంచి గోపీచంద్ మలినేనిని తప్పించి తమిళ డైరెక్టర్ కు ఓకే చెప్పారట విజయ్.

 ఈ విధంగా వారి తమిళ డైరెక్టర్లకు గౌరవం ఇచ్చాడని చెప్పవచ్చు. అయితే ఎందుకు సైడ్ చేశావని గోపీచంద్  అడగగానే నేను వరుసగా తెలుగు వాళ్లతో సినిమాలు చేస్తున్నాను. ఇప్పుడు కూడా తెలుగులో సినిమా చేస్తే తమిళ అభిమానులంతా బాధపడతారు అందుకే మిమ్మల్ని నేను తప్పించాలని చెప్పుకొచ్చారట. దీంతో గోపీచంద్ మలి నేని కూడా చాలా బాధపడ్డారట. నేను తెలుగు వాడిని అయినందుకే నన్ను తప్పించారని ఆయన ఎమోషనల్ గా ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: