
ఈ క్రమంలోనే చిరంజీవి విశ్వంభర సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ పనులు పూర్తయిన తర్వాత.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో మరో సినిమాలో నటించనున్నాడు చిరు. కాగా ఈ సినిమా షూట్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈ రెండు సినిమాలతో చిరంజీవి బ్లాక్ బస్టర్లు అందుకోవాలని కసితో ఉన్నాడు. మరి తన సినిమాలతో ఎలాంటి ప్రభంజనం క్రియేట్ చేస్తారో వేచి చూడాలి. ఇక చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు.
సినిమాలపరంగా సక్సెస్ అందుకుంటూనే.. మరో పక్క రాజకీయాల్లోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా పగ్గాలు చేపట్టి బిజీ బిజీగా గడుపుతున్న ఆయన.. మరో పక్క అడపా సినిమా షూట్లకు కూడా డేట్లు ఇస్తూ తన పెండింగ్ సినిమాలను పూర్తి చేస్తున్నాడు. కాగా ఇలాంటి క్రమంలోనే చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో భారీ మల్టీ స్టారర్ సినిమా మిస్ అయింది అంటూ న్యూస్ నెట్టెంట వైరల్ అవుతుంది. కొన్ని అనుకోని కారణాలతో ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే ఆగిపోయిందట. రాఘవేంద్రరావు డైరెక్షన్లో.. 2000 సంవత్సరంలో ఈ సినిమాలు తెరకెక్కించాలని నిర్మాతలు ప్రణాళిక రూపొందించిన.. సినిమా వర్కౌట్ కాలేదు.