
ఆసుపత్రి చికిత్స ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కాస్త సాయం చేయాలని కోరారు. అలాగే జీవీ బాబుకి దాతలు, కళాకారులు ఆర్దిక సహాయం అందించాలని తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం కోరారు. జీవీ బాబు వరంగల్ జిల్లా రామన్న పేటకు చెందిన రంగస్థల కళాకారుడు. ఈయన రంగస్థల నటుడు నుండి సినీ నటుడిగా ఎదిగాడు. జీవీ బాబు బలగం సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. తాత పాత్రలో ఎంతో సహజంగా నటించి ప్రేక్షకుల మనసును దోచుకున్నారు. అంజన్న పాత్రలో జీవీ రెడ్డి మంచి ఎమోషన్ ని పండించారు. అయినప్పటికీ ఆయనకి అంతగా గుర్తింపు రాలేదు .అవకాశాలు కూడా పెద్దగా రాలేదు.
బలగం సినిమాలో కొమురయ్య తమ్ముడిగా అంజన్న పాత్రలో జీవీ బాబు నటించాడు. అంజన్న పాత్ర ఊరిలో ఉండే ముసలి వాళ్ల పాత్రను గుర్తు తెచ్చుకునేలా చేశారు. ఆయన ఆ పాత్రలో నటించడం ద్వారా ఆ పాత్రకి ఉన్న విలువను కళ్లకు కట్టినట్లు చూపించారు. బలగం సినిమాకు దర్శకుడు వేణు దర్శకత్వం వహించారు. బలగం సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఈ సినిమాలో నటుడు ప్రియదర్శి ముఖ్యపాత్రలో కనిపించారు. ఈ వార్త విన్న ప్రేక్షకులు అందరూ జీవీ బాబు తొందరగా కొలుకోవాలని ఆశిస్తున్నారు. అలాగే సినీ ప్రముఖులు ఈ విషయం తెలుసుకుని ఆయనకు సాయం చేయాలని చెప్పుకొచ్చారు.