
అయితే ఈగని మెయిన్ రోల్ లో పెట్టి తీసిన ఈగ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. థియేటర్ లో భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ఇటీవల రిలీజ్ అయిన హిట్ 3 సినిమాలో రాబందు కనిపించింది. ఈ సినిమా కూడా మంచి హిట్ కొట్టి ప్రేక్షకులను మెప్పించింది. త్వరలో థియేటర్ లో విడుదల కానున్న ది ప్యారడైజ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోనుందని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాలో కూడా సింబాలిక్ గా కాకిని చూపిస్తున్నారు కదా. హీరో నాని సినిమాలలో జంతువులకు ఛాన్స్ ఇచ్చి, సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటున్నాడు. నాని బ్లాక్ బస్టర్ సక్సెస్ కి ఇది ఒక రీజన్ అని చెప్పచ్చు.
ఇక హీరో నాని ఇటు హీరోగా మూవీస్ లో నటిస్తూనే.. అటు నిర్మాతగా సినిమాలను తెరపైకి తీసుకొస్తున్నాడు. ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ మూవీకి హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించింది. ఇప్పటికే హిట్ 1, హిట్ 2 సినిమాలు రిలీజ్ అయ్యి మంచి హిట్ కొట్టాయి. దీంతో ఈ నెల 1న హిట్ 3తో హీరో నాని ప్రేక్షకుల ముందుకి వచ్చి హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలోని ఒక్కో సీన్ గుస్ బంప్స్ వచ్చేలా ఉంది. హిట్ 3 మూవీ రికార్డ్ ని బద్దలుకొట్టింది. ఈ సినిమా విడుదల అయ్యి ఐదు రోజులు పూర్తి అయ్యింది. అయినప్పటికీ కూడా ఈ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.