
నటీనటులే నిర్మాతలుగా మారి సినిమాలు తెరకెక్కించడం అనేది ఎప్పటి నుంచో తెలిసిన విషయమే. తాజాగా సమంత కూడా నిర్మాతగా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. ట్రాలాల ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ‘శుభం’ సినిమా నిర్మించింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందో లేదో చూద్దాం...
సమంత టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు చేస్తుంది. ఇంత బీజీ షెడ్యూల్లో కూడా నిర్మాతగా ‘శుభం’ సినిమా నిర్మించడమే కాదు. అందులో ఓ కీలక పాత్ర పోషించింది. మరి ఈ సినిమాను ఈ బుధవారం మీడియా కోసం స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా లేదా రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
‘శుభం’ సినిమా కథ విషయానికొస్తే.. భీమిలి ఊరులో ముగ్గురు స్నేహితులుంటారు. అయితే రోజు రాత్రి 9 గంటలు అయితే చాలు ఈ స్నేహితుల భార్యలు రాత్రి 9 గంటలకు వచ్చే ‘జన్మజన్మల బంధం’ అనే టీవీ సీరియల్ కు అతుక్కుపోతారు. ఆ సమయంలో వారిని కదిలించినా.. ఇంకా ఏదైనా చేస్తే దెయ్యం వచ్చిన వారిలా ప్రవర్తిస్తుంటారు. అయితే .. ఆ ఊరిలో ఈ ముగ్గురి భార్యలతో పాటు ఆ ఊరిలోని దాదాపు మెజారిటీ లేడీస్ రాత్రి 9 గంటలకు ఇలానే ప్రవర్తిస్తుంటారు. మరి వారి భార్యలను బాగు చేసుకోవడంతో పాటు ఊర్లో ఆడవాళ్లను మాములు మనుషులుగా చేయడానికి ఈ ముగ్గురు స్నేహితులు ఏం చేసారు. చివరకు వీరితో పాటు ఊరి ప్రజలకు శుభం జరిగిందా లేదా అనేదే సినిమా స్టోరీ.
టెక్నికల్ వ్యాల్యూస్ విషయానికొస్తే..
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు పాత కథలను మళ్ళీ ఎంకరేజ్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా మన దర్శకులు 80, 90ల నాటి బ్యాక్ డ్రాప్ కథలతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల కూడా ‘శుభం’ కథను 2004 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాడు. అప్పట్లో కేబుల్ టీవీ ప్రతి ఇంటిలో ఎలా భాగం అయిందో.. దానికి పోటీగా డీటీహెచ్ ఎంట్రీ వంటి రాకతో కేబుల్ టీవీ ప్రాపకం ఎలా మసకబారిందో అనే అంశాలను అంతర్లీనంగా చూపించాడు. ముఖ్యంగా ఇయర్ చూపించకపోయినా.. అందులో శంకర్ దాదా జిందాబాద్, గుడుంబా శంకర్, నువ్వు లేక నేను లేను, ఇక శుభం కథ విషయంలో కూడా ఆకాశంలో సగ భాగమైన మహిళలు, ముఖ్యంగా భర్తతో పాటు భార్యకు సమ ప్రాధాన్యం ఇవ్వాలనే అంశాన్ని చూపించాడు. దానికి ఓ టీవీ సీరియల్ ను ఎంచుకున్నాడు. అందులో విడిపోయిన భార్య భర్తలు తిరిగి ఎలా కలుసుకున్నారు. అలా ఊరిలో 9 గంటలకు అందరు టీవీ సీరియల్ వచ్చే సమయానికి ఏదో దెయ్యం పట్టినవాళ్లలా దానికి అతుక్కోవడం. ఆ సమయంలో వాళ్లను డిస్ట్రబ్ చేస్తే నానా రభస సృష్టించడం వంటి సీన్స్ తో కామెడీ పుట్టించే ప్రయత్నం చేసాడు. ఇక ఇంటి ఇల్లాలు అంటే వంటింటి కుందేలు అనే తరహాలో కాకుండా వారికి తగినంత గౌరవంతో పాటు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడలనే సందేశం కూడా ఈ సినిమాలో చూపించాడు. అంతేకాదు మెజారిటీ మహిళలు చాలా మంది ఏ విషయంలోనైనా శుభప్రదమైన ముగింపు ఉండాలని కోరుకుంటారు. అదే అంశాన్ని దర్శకుడు ఈ సినిమాలో వినోదంతో చూపించాడు. కామెడీ అంశాలు ఎక్కువగా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది సినిమా. ఫ్యామిలీ అంతా కలిసి కట్టుగా చూడదగ్గ ఫన్ రైడ్‌లా ఈ మూవీ ఉంటుంది.
నటీనటల విషయానికొస్తే..
సమంత ఈ సినిమాలో గెస్ట్ పాత్రలో ఓ తాంత్రికురాలిగా మెప్పించింది. హీరోలుగా నటించిన హర్షిత్, శ్రీనివాస్ రెడ్డి, చరణ్ తమ యాక్టింగ్ తో మెప్పించారు. కొత్తవారైనా ఎక్కడా అలా కనిపించకుండా తమ పాత్రలకు తగినట్టు నటించారు. కథానాయికలుగా నటించిన శ్రియా కొంతం, శ్రావణి, శాలిని వంటి వారు తమ నటనతో మెప్పించారు. మిగిలిన నటీనటుల తమ పరిధి మేరకు మెప్పించారు.
ప్లస్ పాయింట్స్
కథనం
నిర్మాణ విలువలు
సమంత గెస్ట్ అప్పీరియన్స్
మైనస్ పాయింట్స్
కొత్త నటీనటులు
కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయింది.
రేటింగ్: 2.75/5