టాలీవుడ్లో మళ్లీ మల్టీ స్టార‌ర్ సినిమాల ట్రెండ్ మొదలైంది .. స్టార్ హీరోలు తమ అభిమానులను మెప్పించే కథలతో పాటు మల్టీ స్టార‌ర్ సినిమాలు చేయడానికి కూడా ఓకే చెబుతున్నారు .. స్టార్ మల్టీస్టారర్ లో ఏ హీరో డామినేషన్ ఉంటుంది ఆ సమయంలో ఫ్యాన్స్ ని ఎలా సాటిస్ఫై చేయాలన్న సమీకరణాలు ఎన్నో ఉంటాయి .  అయితే త్రిబుల్ ఆర్ సినిమా విషయంలో రాజమౌళి దీన్ని బాగా బ్యాలెన్స్ చేశాడు భీమ్ పాత్రలో ఎన్టీఆర్ ని రామరాజు పాత్రలో రామ్ చరణ్ ని ప్రేక్షకులకు మెప్పించే విధంగా చూపించాడు .అయితే ఇప్పుడు ఇలాంటి క్రేజీ మల్టీస్టార‌ర్  సినిమాలు మళ్లీ మళ్లీ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు .. ముఖ్యంగా నందమూరి అభిమానులైతే ఆ కుటుంబ హీరోలు కలిసి చేస్తే చూడాలని ఆశిస్తున్నారు .  


ఎన్టీఆర్ , కళ్యాణ్రామ్ ఇద్దరూ కలిసి చేసే సినిమా కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు .  రామలక్ష్మణులు అంటే వీరిద్దరే అనేట్టుగా ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ ఒకరి మీద ఒకరు ప్రేమ అభిమానాలు చూపించుకుంటూ వెళ్తున్నారు .. ఇక ఎన్టీఆర్ కి అన్న కళ్యాణ్ రామ్ అంటే ఎంతో ఇష్టం .ఇక కళ్యాణ్ రామ్ కూడా తమ్ముడు ఎన్టీఆర్ ని నాన్న నాన్న అంటూ ముద్దుగా పిలుస్తాడు .. అయితే తెరమీద ఇద్దరు అలా ఒక సినిమాలో కనిపిస్తే చూడాలని అభిమానులుు ఆశపడుతున్నారు.. అయితే ఇప్పుడు ఇది ఇప్పుడప్పుడే కుదిరేలా లేదు .. ఎన్టీఆర్ వరుస పాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు .. ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో డ్రాగన్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ .  ఈ సినిమా తర్వాత దేవ‌ర 2 లైన్ లో ఉంది .. ఇప్పటికే బాలీవుడ్లో చేసిన వార్ 2 రిలీజ్ కు రాబోతుంది ..


దీన్ని బట్టి ఎన్టీఆర్ తో కొత్త సినిమా అది కూడా కళ్యాణ్ రామ్ తో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కుదిరే పని కాదు .  ఇక కళ్యాణ్ రామ్ కూడా రీసెంట్ గానే అర్జున్ స‌న్నాఫ్‌ వైజయంతి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు .. తర్వాత సినిమా ప్లానింగ్ ఏంటి అన్నది కూడా క్లారిటీ లేదు .. ఇప్పుడు కుదరకపోయినా రాబోయే రోజుల్లో అయినా అటు ఎన్టీఆర్ ఇటు కళ్యాణ్రామ్ ఇద్దరికీ సరైన కథ దొరికినప్పుడు ఇద్ద‌రు కలిసి మల్టీస్టారర్ సినిమా చేసే అవకాశం అయితే ఉంది .. ఇక ఈ సినిమాలో బాలయ్య కూడా చిన్న కామియో చేస్తే అది మరో లవ్ లో ఉంటుంది .  ఇక ఇప్పుడు ఇలాంటి సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారురు .  అయితే సరైన కథ దొరికితే మాత్రం ఇది కుదురుతుందని చెప్పవచ్చు ..

మరింత సమాచారం తెలుసుకోండి: