తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు . పాన్ ఇండియా హీరోలు ఉన్నారు . ఒక్కొక్క సినిమాకి వంద నుంచి 150 కోట్లు తీసుకుని.. సినిమా ఇండస్ట్రీని షేక్ చేసే స్టార్స్ కూడా ఉన్నారు.  కానీ అందరి పేర్లు చెప్పినప్పుడు ఏదో ఒక కాంట్రవర్షియల్ మేటర్ బయటకు వస్తూనే ఉంటుంది . అది పొలిటికల్ పరంగా ఫ్యామిలీ పరంగా ఏ విధంగా అయినా కావచ్చు.  కానీ కాంట్రవర్షియల్ మ్యాటర్ లో అస్సలు ఇప్పటివరకు ఇరుక్కోని హీరో ఎవరైనా ఉన్నాడు అంటే మాత్రం అది కచ్చితంగా ఆరడుగుల అందగాడు ప్రభాస్ అనే చెప్పుకోవాలి.


ప్రభాస్ మాట తీరు.. ఆయన పీహెచ్ చేసే పద్ధతి అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది . అసలు కాంట్రవర్షియల్  అనే పదానికి ఆమడ దూరంలో ఉంటాడు ప్రభాస్ . కాగా ఇప్పుడు ప్రభాస్ ఎన్ని ప్రాజెక్ట్స్ లో భాగమై ఉన్నాడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ప్రతి ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్నాడు . కాగా ప్రభాస్ ఆస్తి కూడా ఎక్కువే . ప్రభాస్ సంపాదించిందంతా కూడా ప్రాపర్టీస్ తీసేస్తూ ఉంటాడు.  ఆ మధ్య 50 కోట్లు పెట్టి తన డ్రీమ్ హౌస్ కూడా కట్టించుకున్నాడు అంటూ టాక్ వినిపించింది . కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ట్రెండింగ్ లోకి వచ్చింది .



ప్రభాస్ కి వేల కోట్ల ఆస్తి ఉంది . కానీ ఆయన దగ్గర మాత్రం ఒక వస్తువు అసలు ఉండనే ఉండదు అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.  నిజానికి ఈ మధ్యకాలంలో టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు చేతులో ఫోన్ వచ్చేస్తుంది . ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పై అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . కానీ ప్రభాస్ కి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదట . నిజానికి ఆయన ఫోన్ కూడా ఆయన దగ్గర ఎప్పుడూ ఉండదట . ఆయన కార్ డ్రైవర్ దగ్గరనో ఆయన పీఏ దగ్గరనో ఉంటుందట . ఎవరైనా ఆయనకి కాల్ చేయాలి అనుకున్న కూడా ఈ విషయం కారణంగానే ఆయన ని కోప్పడుతూ ఉంటారట .



సరదాగా ఫ్రెండ్స్ తో  పార్టీకి వెళ్లాలి అన్న ఫ్రెండ్స్ మీటప్ అవ్వాలి అన్న ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ గురించి చెప్పాలి అన్న ప్రభాస్ చేతిలో అసలు ఫోనే ఉంటదట.  ప్రభాస్ కి ఉండేదే ఒక ఫోన్ .. ఆ ఫోన్ కూడా ఎక్కడ పెడతాడో ప్రభాస్ కే తెలియదట . సినిమాల విషయాలు మాత్రం పూర్తిగా మేనేజర్ చూసుకుంటూ ఉంటారట . ఈ విషయాన్ని స్వయానా రాజమౌళి - ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు . ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కి పూర్తిగా దూరంగా ఉంటారట . ఆశ్చర్యమేంటంటే అనుష్కకి కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు . ఈ విషయాన్ని ఓసారి  ఓ రియాల్టి షోలో బయటపెట్టింది..
!

మరింత సమాచారం తెలుసుకోండి: