ఇక చిత్ర పరిశ్రమలో నిన్న మొన్నటివరకు హీరోల రెమ్యూనరేషన్ విషయంలో పెద్ద డిస్కషన్ ఉండేది .. అయితే ఎప్పుడు పరిస్థితి మారింది హీరోయిన్లు కూడా భారీగా రేటు పెంచేస్తున్నారు .. సినిమాల రేంజ్ కు తగ్గట్టుగానే తమ పారితోషికం కూడా ఉండాలని వారు గట్టిగా పట్టుబడుతున్నారు .. గత సినిమాలకు తీసుకున్న వాటికి ఏమాత్రం సంబంధంలేని విధంగా హీరోయిన్ల డిమాండ్స్ ఉంటున్నాయి .. బాలీవుడ్ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటున్న దీపికా పదుకొనే సినిమాలకు పెద్దగా డిమాండ్స్ లేకుండానే పేమెంట్ తీసుకుంటున్నారు ..


 అయితే మరోసారి ప్రభాస్ తో నటించేందుకు మాత్రం భారీ స్థాయిలో రేటు పెంచాల్సిందే అని పట్టు పడుతుంది ఈ బ్యూటీ .. బాలీవుడ్లో ప్రస్తుతం 10 కోట్లకు కాస్త అటు ఇటుగా అందుకుంటున్న దీపిక .. ప్రభాస్ స్పిరిట్ సినిమాకు మాత్రం ఏకంగా 20 కోట్లు ఇవ్వాలి అంటుంది ఈ ముద్దుగుమ్మ . అలాగే సౌత్ లేడీ  సూపర్ స్టార్ నయనతార కూడా రెమ్యూనరేషన్ విషయంలో కాస్త గట్టిగానే ఉంటున్నారు .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రాబోయే సినిమాలో నయనతారను హీరోయిన్గా తీసుకోబోతున్నారు . అయితే ఈ సినిమాలో నటించేందుకు న‌య‌న్ ఏకంగా 18 కోట్లు డిమాండ్ చేశారని ప్రచారం జరిగింది ..


అయితే అంత ఎక్కువ కాకపోయినా భారీగానే నయనతార అందుకోబోతున్నట్టు టాలీవుడ్ వర్గాల‌ నుంచి అందుతున్న టాక్ . ఇలా అగ్ర హీరోయిన్లే కాదు కొత్త హీరోయిన్ల కూడా రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదిలే అంటున్నారు .. ప్రేమలు సినిమాలతో సెన్సేషన్ గా మారిన మమితా బైజు తన రెమ్యూనరేషన్ డబుల్ చేసే ఆలోచనలో ఉన్నారు .. ప్రేమలు టైంలో 25 లక్షల పేమెంట్ తీసుకున్న మమితా బైజు ఇప్పుడు ఏకంగా రెండు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్ .  ఇలా ఇండస్ట్రీ ఏదైనా సినిమా ఏదైనా హీరోయిన్ల రెమ్యూనరేషన్ విషయంలో హీరోలను మించిపోయారు అనడంలో ఎలాంటి సందేహం లేదు .

మరింత సమాచారం తెలుసుకోండి: