
ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ టైం సోషల్ మీడియాలో సాయి పల్లవిని ఒక డైరెక్టర్ మోసం చేశాడు అన్న వార్త హ్యూజ్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఆ డైరెక్టర్ మరెవరో కాదు శేఖర్ కమ్ముల . ఫీల్ గుడ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న శేఖర్ కమ్ముల . శేఖర్ కమ్ముల డైరెక్షన్లో సాయి పల్లవి రెండు సినిమాల్లో నటించింది . మొదటిగా ఫిదా అనే సినిమాలో నటించి తన కెరీర్ ని టర్న్ చేసుకుంది . ఆ తర్వాత లవ్ స్టోరీ అనే సినిమాలో నటించింది . ఫిదా సినిమాలో వరుణ్ తేజ్ తో స్క్రీన్ షేర్ చేసుకుని ఎలా వావ్ అనిపించిందో అందరికీ తెలిసిందే .
ఆ తర్వాత లవ్ స్టోరీ సినిమాలో నాగచైతన్యత స్క్రీన్ షేర్ చేసుకుని శేఖర్ కమ్ముల - సాయి పల్లవి కాంబో మరొక్కసారి సూపర్ సక్సెస్ అంటూ ట్యాగ్ చేయించుకుంది . అయితే ముచ్చటగా మూడోసారి సాయి పల్లవి - శేఖర్ కమ్ముల కాంబో రాబోతుంది అంటూ తెగ వార్తలు వినిపించాయి. శేఖర్ కమ్ముల కూడా తన లక్కీ హీరోయిన్ ని తన నెక్స్ట్ సినిమాలో పెట్టుకోవాలి అంటూ డిసైడ్ అయిపోయాడట . ధనుష్ తో "కుబేర" సినిమాని తెరకెక్కించాడు శేఖర్ కమ్ముల. ఈ సినిమాలో సాయి పల్లవిని పెట్టుకోవాలి హీరోయిన్గా అంటూ బాగా ఫిక్స్ అయిపోయాడట .
ఆల్మోస్ట్ సాయి పల్లవి ఫైనలైజ్ అయిపోయినట్లే అనుకున్న మూమెంట్లో కొన్ని కారణాల చేత సాయి పల్లవి తీసేసి ఆ ప్లేస్ లోకి వేరే హీరోయిన్ రష్మికని తీసుకొచ్చాడు . దీంతో సీన్ మొత్తం మారిపోయింది . ధనుష్ - సాయి పల్లవి రౌడీ బేబీ కాంబో రిపీట్ కాబోతుంది అంటూ అశలు పెట్టుకున్న జనాలకు మైండ్ బ్లాక్ అయిపోయింది . దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో శేఖర్ కమ్ములపై నెగిటివిటీ ఏర్పడిపోయింది . చాలా ఘాటుగానే సాయి పల్లవి ఫ్యాన్స్.. శేఖర్ కమ్ములకు కౌంటర్స్ వేశారు . మరికొందరైతే సాయిపల్లవి ఇక శేఖర్ కమ్ములను నమ్మొద్దు అంటూ కూడా మాట్లాడుకున్నారు. అయితే సాయి పల్లవి మాత్రం దాని గురించి ఏ విధంగా స్పందించలేదు . సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతుంది . కొంతమంది మాత్రం సాయి పల్లవి చాలా సైలెంట్ గానే దెబ్బ కొడుతుంది అని ఇక లైఫ్ లో శేఖర్ కమల దర్శకత్వంలో సాయి పల్లవి నటించదు అంటూ మాట్లాడుకుంటున్నారు. ప్రజెంట్ బాలీవుడ్ రామాయణ సినిమాలో బిజీ గా ఉంది సాయి పల్లవి..!