ఏంటి చిరంజీవి తన కోడలు ఉపాసనను లండన్లోనే వదిలేసి రమ్మన్నారా.. ఇంతకీ చిరంజీవి ఎందుకు అలా అన్నారు.. ఏమైనా గొడవలు జరిగాయా అనేది ఇప్పుడు చూద్దాం.తాజాగా లండన్ లోని టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహా ఆవిష్కరణ కోసం మెగా ఫ్యామిలీ మొత్తం లండన్ కి వెళ్లి ఆ విగ్రహంతో ఫోటోలు దిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే లాండన్ లోని మ్యూజియంలో తన కొడుకు విగ్రహం పెట్టడం పట్ల చిరంజీవి అభిప్రాయం ఎలా ఉందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.. చరణ్ విగ్రహం పెట్టడంతో నా జీవితంలో ఏదో గొప్పది సాధించాను అని అనుకుంటున్నాను.నేను చరణ్ పుట్టకముందు ఆ మ్యూజియం కి వెళ్లినప్పుడు నా కొడుకు పుట్టాక ఇక్కడే విగ్రహం పెడతారు అని నేను అన్నాను. ఆరోజు అన్నట్లుగానే చెర్రీ విగ్రహన్ని  ఈ మ్యూజియంలో పెట్టారు.

 ఇక చరణ్ విగ్రహాన్ని లండన్ లో పెడతామని ఫోన్ కాల్ వచ్చిన సమయంలో నాకు పుత్రోత్సాహం అనే పద్యం గుర్తుకొచ్చింది. అలాగే సురేఖ ఆనందానికి అవధులే లేవు ఆమె ఆనందాన్ని వర్ణించలేము. మ్యూజియంలో చరణ్ విగ్రహాన్ని చూసి అచ్చం మన చరణ్ లాగే ఉన్నాడే..వీడిని ఒక్కడినే ఇక్కడ వదిలేసి వస్తే ఎలా అని నాతో అంది.అప్పుడు నేను అన్న మాటలకి సురేఖ షాక్ అయింది.ఒక్కడే ఉంటున్నాడు అంటున్నావు కదా ఉపాసనను కూడా ఇక్కడే వదిలేసి రా.. వాడి ఆలనా పాలన చూసుకుంటుంది అని అన్నాను. ఆ మాటలకు అక్కడున్న వాళ్ళందరూ నవ్వేశారు. రామ్ చరణ్ మీద సురేఖకి ఎంత ప్రేమో తెలిసొచ్చింది.

అలాగే ఈ మ్యూజియంలో పెట్టే విగ్రహాలన్నీ ప్రాణం ఉన్నట్లే కనిపిస్తాయి. ముఖ్యంగా రామ్ చరణ్ తో పాటు రైమ్ విగ్రహాన్ని కూడా ఇందులో పెట్టారు. ఇప్పటివరకు ఇలాంటి ఘనత క్వీన్ ఎలిజబెత్ తర్వాత రామ్ చరణ్ కే దక్కింది. క్వీన్ ఎలిజబెత్ కి కూడా తన పెంపుడు కుక్కతో విగ్రహాన్ని పెట్టారు. ఆ తర్వాత రామ్ చరణ్ కే ఆ ఘనత దక్కింది. ఇక రాంచరణ్ పక్కన పెట్టిన రైమ్ విగ్రహం కి ఉన్న వెంట్రుకలు కూడా సహజమైనవి. ఒక్కొక్కటిగా దానికి అతికించారు. భవిష్యత్తులో గత తరం వారు ఏం సాధించారు అనేది తెలియడానికి ఈ విగ్రహాన్ని సాక్షాలుగా స్ఫూర్తినింపడానికి ఉంటాయి..అంటూ తన కొడుకు మైనపు విగ్రహం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చిరంజీవి.

మరింత సమాచారం తెలుసుకోండి: