నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజాగా అభిమానుల చేత అవమానానికి గురైంది. రష్మిక మందన్నా తాజాగా ఓ ఈవెంట్ కి వెళ్ళింది. ఆ ఈవెంట్ లో రష్మిక మందన్నా అభిమానుల దగ్గరికి వెళ్లి వారికి సెల్ఫీలు ఇద్దామని అనుకుంది. కానీ అభిమానులు చేసిన పనికి రష్మిక షాక్ అయ్యి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరి ఇంతకీ అభిమానులు రష్మిక మందన్నా షాక్ అయ్యేలా ఏం చేశారు అనేది ఇప్పుడు చూద్దాం. రష్మిక మందన్నా ప్రస్తుతం సౌత్ నార్త్ ఇండస్ట్రీ అనే తేడా లేకుండా ఎన్నో సినిమాలు చేస్తూ బిజీయెస్ట్ హీరోయిన్ గా ఉంది.అలా నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా ఛావా వంటి బ్లాక్ బస్టర్ మూవీని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

 అలాగే ది గర్ల్ ఫ్రెండ్ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ కూడా చేస్తోంది. అయితే అలాంటి రష్మిక మందన్నా తాజాగా జీ అవార్డ్స్ ఫంక్షన్ కి గెస్ట్ గా వెళ్ళింది. అలా అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతున్న సమయంలో అభిమానులందరూ రష్మికతో సెల్ఫీలు దిగడానికి ఆసక్తి చూపారు. దాంతో రష్మిక మందన్నా వెంటనే అభిమానులకు సెల్ఫీలు ఇచ్చి తన అభిమానాన్ని చాటుకోవాలి అనుకుంది.కానీ తీరా స్టేజ్ దిగి అభిమానుల దగ్గరికి వెళ్లి అభిమానుల్లో ఒకరిగా కూర్చొని వారికి సెల్ఫీలు ఇస్తున్న తరుణంలో కొంతమంది అభిమానులు అత్యుత్చాహం కనబరిచి  ఏదో లవర్ తో ఫోటోలు దిగుతున్నట్లు రష్మిక మందన్నాపై చేతులు వేసి ఫోటోలు దిగాలని చూసారు. 

అలా రష్మిక మందన్నా మీద ఒక్కొక్కరు చేతులు వేస్తూ ఆమెని నలిపేయడంతో వెంటనే భయపడి పోయిన రష్మిక అక్కడి నుండి స్టేజ్ మీదకి వచ్చింది. అయితే ప్రస్తుతం రష్మిక మందన్నా అలా అభిమానులకు సెల్ఫీలు ఇస్తూ ఇబ్బందిపడిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు ఈ వీడియోకి నవ్వుతూ కామెంట్లు పెడుతున్నారు. కొంతమందేమో అభిమానులు అత్యుత్చాహం తెలిసాక కూడా స్టేజ్ దిగి మరీ వారికి సెల్ఫీలు ఇద్దామనుకొని వెళ్లిన రష్మికకు తగిన శాస్త్రి జరిగింది అంటే మరి కొంతమంది ఏమో అంత ఓవరాక్షన్ అవసరమా అంటూ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: