
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు భక్తులు ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుప్పాల నిహార్ అనే పవన్ వీరాభిమాని చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. అమెరికాలో ఉన్న పుప్పాల నిహార్ మిస్సోరి సెయింట్ లూయిస్ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేయగా జనసేన సింబల్ అయిన రెడ్ కలర్ టవల్ తో హాజరై పట్టా పుచ్చుకున్నారు.
పుప్పాల నిహార్ కారు నంబర్ పీ.ఎస్.పీ.కే9 అంటే పవన్ అంటే ఎంత అభిమానమో సులువుగా అర్థమవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఇలాంటి అభిమానులు ఉంటారని చెప్పవచ్చు. నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్న పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను సైతం ఈ ఏడాదే పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయితే ఫ్యాన్స్ మరింత సంతోషిస్తారు.
పవన్ కళ్యాణ్ ఓకే చెబితే ఆయనతో సినిమాలను తెరకెక్కించడానికి దర్శకనిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ పారితోషికం 60 నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. అయితే పవన్ తన పారితోషికంలో ఎక్కువ మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసమే ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. భవిష్యత్తు సినిమాలతో పవన్ మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ క్రేజ్ మాత్రం వేరే లెవెల్ లో ఉంది.