టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ బాబాయ్ , అబ్బాయి అనే విషయం మన అందరికీ తెలిసిందే. వీరిద్దరి మధ్య బాండింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. చరణ్ నటించిన ఎన్నో సినిమా ఈవెంట్లకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం చరణ్ "గేమ్ చేంజర్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఆ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ దర్శకుడు త్రివిక్రమ్ అత్యంత సన్నిహితులు అనే విషయం కూడా మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే పవన్ , త్రివిక్రమ్ కాంబో లో జల్సా , అత్తారింటికి దారేది , అజ్ఞాతవాసి అనే సినిమాలు కూడా వచ్చాయి. చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి చరణ్ కమిట్ అయ్యాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల అయింది.

కానీ చరణ్ లైనప్ కాస్త మారినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ కథను చెప్పినట్లు , ఆ కథ మొత్తం విన్న పవన్ కి ఆది తనపై కంటే కూడా చరణ్ పై అద్భుతంగా వర్కౌట్ అవుతుందని సలహా ఇచ్చినట్లు , ఆ సలహా మేరకు త్రివిక్రమ్ ఆ కథను చరణ్ కి వినిపించగా ఆయన కూడా పెద్ది సినిమా తర్వాత త్రివిక్రమ్ తో చాలా స్పీడ్ గా ఓ మూవీ ని పూర్తి చేసి ఆ తర్వాత సుకుమార్ తో మూవీ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజం అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: