మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమ లో నటుడి గా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు . ఈ మధ్య కాలంలో రవితేజ చాలా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సరైన విజయాలను అందుకోవడంలో మాత్రం చాలా వెనుకబడిపోయాడు. రవితేజ వయసు ఇప్పటికే 57 సంవత్సరాల లోపు ఎంట్రీ ఇచ్చింది. అయినప్పటికీ రవితేజ మాత్రం తనకంటే చాలా చిన్న వయసు కలిగిన హీరోయిన్లతో నటిస్తున్నాడు. దానితో రవితేజ తన రూటు మార్చాలి అని , తనకంటే చాలా చిన్న వయసు ఉన్న హీరోయిన్లతో నటించడం కంటే కూడా కాస్త సీనియర్ హీరోయిన్లతో నటిస్తే బాగుంటుంది అని కొంత మంది అభిప్రాయాలను వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ రవితేజ మాత్రం తన పందాలో తాను దూసుకుపోతున్నాడు.

కొంత కాలం క్రితం రవితేజ మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తోనే ఈమె తెలుగు తెరకు పరిచయం అయింది. ప్రస్తుతం రవితేజ మాస్ జాతర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే రవితేజ తన తదుపరి మూవీ ని కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్గా నటించే అవకాశం ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరర్ అవుతుంది. మరి ఈ మూవీ లో రవితేజ సరసన ఎవరు హీరోయిన్గా నటిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt