ఈరోజు నిజంగా నందమూరి అభిమానులకి ఒక బిగ్ పండగ లాంటి రోజే అని చెప్పాలి . జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు . అంటే తారక్ ఫ్యాన్స్ కి బాగా బొగ్ ఫెస్టివల్. తమ పుట్టినరోజును అయినా మర్చిపోతారేమో కానీ తమ ఫేవరెట్ హీరో హీరోయిన్ల పుట్టినరోజును మాత్రం ఫ్యాన్స్ అస్సలు మర్చిపోరు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఎన్టీఆర్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో అందరికీ బాగా తెలిసిన విషయమే . సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఫ్యాన్స్ శ్రేయోభిలాషులు పలువురు స్టార్స్ .

జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటూ బ్లెస్ చేస్తున్నారు . ఇలాంటి మూమెంట్లోనే జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు కూడా సోషల్ మీడియా వేదికగా బాగా ట్రెండ్ అవుతున్నాయి.  జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్ లో ఎన్నో సినిమాలల్లో నటించాడు.  కొన్ని సినిమాల హిట్ అయ్యాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి . అయితే జూనియర్ ఎన్టీఆర్ భారీ స్థాయిలో హిట్ అవుతుంది అనుకొని తుస్సుమంటూ డిజాస్టర్ అయిన సినిమా "ఆంధ్రవాలా". ఈ సినిమా ఎన్టీఆర్ సినీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది .

అసలు ఎందుకు ఇలాంటి కథ చూస్ చేసుకున్నావ్ అన్నా..? అంటూ నందమూరి ఫ్యాన్స్ కూడా నిలదీశారు . ఆ రేంజ్ లో ఈ సినిమా నెగిటివ్ టాక్ దక్కించుకుంది.  ఈ సినిమా లాంటి స్టోరీని మళ్లీ ఎప్పుడు టచ్ చేయలేదు జూనియర్ ఎన్టీఆర్ . తారక్ కి కూడా ఈ సినిమా ఏదో రేంజ్ లో హిట్ అయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుంది అని భావించేసాడట.  కానీ ఈ సినిమా మాత్రం డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది. కానీ ఎన్టీఆర్  ఫేవరేట్ మూవీల లిస్ట్ లో వన్ ఆఫ్ ద టాప్ మూవీలో గా ఈ డిజాస్టర్ సినిమా కూడా ఉండడం అందరికీ ఆశ్చర్యకరం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: