
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న డ్రాగన్ సినిమాపై రోజుకొక రూమర్ సరికొత్తగా వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ కనిపించబోతోంది. ఇది చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ఒక కీలక పాత్రలో నటిస్తోందని .. పైగా ఆమె పోలీసు ఉన్నతాధికారి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. సహజంగా ప్రశాంత్ నీల్ సినిమాలలో క్యారెక్టర్లు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. మరి విద్యాబాలన్ పాత్రను ఆయన ఎలా డిజైన్ చేశారో ? చూడాలి. డ్రాగన్ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లోనే అత్యుత్తమ సినిమాలలో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ఎంతో కష్టపడుతున్నాడు.
ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైం తీసుకున్నాడు. ఇప్పటివరకు ప్రశాంత్ తీసిన అన్ని సినిమాలలో కెల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని ప్రశాంత్ నీల్ కూడా చెబుతున్నాడు. కొద్ది రోజుల క్రితం ప్రశాంత్ డ్రాగన్ సినిమా గురించి మాట్లాడుతూ ఆడియన్స్ ఊహించిన స్థాయిలో ఈ సినిమాను తీస్తున్నాను ... ఎన్టీఆర్ పై అభిమానంతో ఈ సినిమా చేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ - ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా రవి బ్రసూర్ సంగీతం అందిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు