
అయితే ఇంతలోనే కియారా అద్వానీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ ఫోటోల్లో హాస్పిటిల్ బెడ్‌పై బేబీని హత్తుకుని మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ కియారా కనిపించింది. పక్కనే భర్త సిద్ధార్థ్ మల్హోత్రా కూడా ఉన్నాడు. ఫోటోలు చాలా రియలిస్టిక్ గా ఉండటంతో కియరా అద్వానికి నిజంగా డెలివరీ అయిపోయిందని కొందరు భావించారు. మరికొందరు మూడు నెలల క్రితమే ప్రెగ్నెన్సీని ప్రకటించిన కియారా అప్పుడే బిడ్డను కనేసిందా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. చూస్తుంటే నిజమైన ఫోటోలు లాగానే కనిపించడంతో అభిమానులు సైతం ఒకంత గందరగోళానికి గురయ్యారు.
అయితే ఇంతవరకు కియారా అద్వానీ కానీ.. సిద్ధార్థ్ మల్హోత్రాకు గానీ అధికారికంగా తమ బిడ్డ గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు ఫేక్ అని తేలిపోయాయి. అవి ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఫోటోలే అని అభిమానులు కూడా నిర్ధారణకు వచ్చారు. ఇక కియారా డెలివరీ ఫోటోలు ఫేక్ అని తెలిశాక.. `అరేయ్ మరీ ఇంత మోసమా` అంటూ నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. కాగా, కియారా అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌ల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ భామ `వార్ 2` చిత్రంలో నటిస్తోంది. అలాగే కన్నడలో యష్‌కు జోడిగా `టాక్సిక్` మూవీకి సైన్ చేసింది.