తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు వేసిన పునాది మహావృక్షంలో విస్తరించింది. ఇప్పటివరకు నందమూరి వంశం నుంచి మూడు తరాల హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చారు. ప్రస్తుతం నందమూరి లెగసీని ముందుకు నడిపించడంలో బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఇదే త‌రుణంలో నంద‌మూరి నాలుగో త‌రం హీరో ఎంట్రీకి కూడా రంగం సిద్ధమయింది.


నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ తనయుడు తారక రామారావు హీరోగా త్వరలోనే ప‌రిచ‌యం కాబోతున్నాడు. ఈ బాధ్యతను ప్రముఖ దర్శకుడు వైవి.ఎస్ చౌదరి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ ఫిల్మ్ ఎంట్రీ పై నెట్టింట జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు.. ఇటీవల ఎయిర్ పోర్ట్ లో తన పెద్ద కొడుకు అభయ్ రామ్ మీద చేయి వేసి ఎన్టీఆర్ నడుస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.
ఈ వీడియోలో అభ‌య్ లుక్ తారక్ ఫాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఎన్టీఆర్ మారిదిగానే అభ‌య్ కూడా స్టైలిష్ గా చ‌రిష్మాటిక్ గా క‌నిపించ‌డంతో.. అభయ్ రామ్ ఆరంగేట్రంపై అభిమానులు చర్చలు మొదలుపెట్టారు. ప్ర‌స్తుతం అభ‌య్ కు 12 ఏళ్లు. స్కూలింగ్ ద‌శ‌లో ఉన్నాడు. అయితే మ‌రో నాలుగైదేళ్ల‌లో టీనేజీ ప్రేమ‌క‌థ‌ల్లో న‌టించేంత వ‌య‌సుకు చేరుకుంటాడు. ఈ నేప‌థ్యంలోనే అభయ్ రామ్ ఫిల్మ్ ఎంట్రీ మ‌రో నాలుగేళ్ల‌లో ఉంటుంద‌ని అభిమానులు అతి ఉత్సాహంతో ముహూర్తం కూడా పెట్టేస్తున్నారు. కానీ, అభ‌య్ వ‌య‌సు చాలా చిన్న‌ది. పైగా ఎన్టీఆర్ వార‌సుడిగా అభ‌య్ ఇండ‌స్ట్రీలోకి వ‌స్తాడా? అస‌లు అత‌నికి యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్ ఉందా? వంటి విష‌యాలపై ఎటువంటి క్లారిటీ లేదు. అయిన కూడా స్ట‌డీస్ కొన‌సాగిస్తూ అడ‌పాద‌డ‌పా సినిమాలు చేసే ఛాన్స్ ఉందంటూ అభ‌య్ గురించి ఫ్యాన్స్ ముచ్చ‌టించుకోవ‌డం నిజంగా విడ్డూర‌మే.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: