
ఇదిలా ఉంటే.. రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా నిర్వహించిన చిట్ చాట్ లో తమన్నా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. సినీ పరిశ్రమలోకి రావాలని నిర్ణయించుకున్న సమయంలో తనకు ఎదురైన అనుభవాలను తమన్నా పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. `ఇప్పటికీ ఇండస్ట్రీలోకి ఆడవారు వస్తున్నారంటే అదో పెద్ద నేరంగా చాలామంది భావిస్తుంటారు. నేను నటి కావాలని ఇంట్లో చెప్పినప్పుడు.. ఇరుగుపొరుగు వారికి తెలిసి నేనేదో పెద్ద నేరం చేస్తున్నట్లుగా మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీ గురించి మా అమ్మానాన్నలకు భయంకరంగా చెప్పారు.
నాడు వాళ్ళ మాటలు మా పేరెంట్స్ వీనుంటే నేడు నేను ఇండస్ట్రీలో ఉండేదాన్నే కాదు. నటిగా నా కెరీర్ ప్రారంభించక ముందే ముగిసిపోయేది. అన్ని రంగాల్లోనూ వేధింపులు సహజమే. కానీ సినీ ఇండస్ట్రీని మాత్రమే ఎందుకు భూతార్థంలో పెట్టి చూస్తారు?` అంటూ తమన్నా ప్రశ్నించింది. ఇక సోషల్ మీడియాలో ఆడవారి వస్త్రధారణ విషయంలో అంకుల్స్ ఇచ్చే సలహాలపై తమన్నా ఆగ్రహం వ్యక్తం చేసింది. `ఆడవారు ఎటువంటి దుస్తులు ధరించాలో, ఎటువంటి దుస్తులు ధరించకూడదో చివరకు అంకుల్స్ కూడా సలహాలు ఇస్తున్నారు. వారికి నేను చెప్పేది ఒక్కటే. ముందు మీ మానసిక స్థితిని సరిచేసుకోండి. అవసరమైతే మానసిక వైద్యుడ్ని కలవండి. అనవసరంగా సలహాలు ఇస్తూ విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోకండి` అంటూ తమన్నా క్లాస్ పీకింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు