సలార్ లో ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్‌ల తర్వాత బాగా హైలెట్ అయిన క్యారెక్టర్ శ్రియా రెడ్డిదే. అయితే సలార్ కన్నా ముందే ఈ అమ్మడు తెలుగులో శ్రియా రెడ్డి `అప్పుడప్పుడు`, `అమ్మ చెప్పింది` వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది. అలాగే తమిళ డబ్బింగ్ మూవీ `పొగరు`లో విశాల్ ను పొందేందుకు పరితపించే ఈశ్వరి పాత్రలో శ్రియా రెడ్డి స్ట్రాంగ్ ఇంప్యాక్ట్ ను క్రియేట్ చేసింది. టెర్రిఫిక్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఓ రేంజ్ లో భయపెట్టింది.
2011 నుండి సినిమాలకు దూరంగా ఉన్న శ్రియా రెడ్డి.. 2018లో `సమ్ టైమ్స్` మూవీతో నటిగా రీఎంట్రీ ఇచ్చింది. ఆపై సలార్ మూవీలో లేడీ విలన్‌గా అలరించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ `ఓజీ`తో పాటుగా తమిళంలో ఓ సినిమా చేస్తోంది. ఇకపోతే శ్రియా రెడ్డి, హీరో విశాల్ మధ్య ఉన్న లింకేంటో తెలిస్తే షాకైపోతారు. ఎందుకుంటే, వీరిద్దరూ చాలా దగ్గరి బంధువులు.
విశాల్ అన్నయ్య విక్రమ్ కృష్ణను 2008లో శ్రియా రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి ప్రేమకు పునాది పడింది విశాల్ నటించిన `పొగరు` సినిమాతోనే. ఈ మూవీకి విక్రమ్ కృష్ణ నిర్మాత కావడంతో.. శ్రియా రెడ్డికి అతనితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారిదీసింది. ఈ వివాహం ద్వారా శ్రియా రెడ్డి విశాల్‌కు వదిన అయింది. విశాల్ నటించిన పలు సినిమాలను విక్రమ్ కృష్ణ నిర్మించారు, శ్రియా రెడ్డి కూడా కొన్ని చిత్రాలకు సహ నిర్మాతగా పని చేసింది.