ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు చిత్ర పరిశ్రమ వైఖరి పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు .. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా పెద్దలు ముఖ్యమంత్రిని కలవకపోవడంపై ఆయన పరోక్షంగా అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే .. అలాగే ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు సోషల్ మీడియా వేదికగా స్పందించారు .. ఇక మన చిత్ర పరిశ్రమంలోని అంతర్గత రాజకీయాలు ఐక్యత లోపంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ..


తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత భావం లేదని పవన్ కళ్యాణ్ అన్నట్టు తెలుస్తుంది .. అలాగే కూటమి  ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అవుతున్న టాలీవుడ్ సంఘాలు ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా అసలు కలిసారా ? అని ఆయన ప్రశ్నించినట్టు వార్తలు కూడా వస్తున్నాయి .. అలాగే పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమంలో కొంత హాట్ టాపిక్ గా మారాయి .



అయితే ఈ క్రమంలోనే నిర్మాత బన్నీ వాసు సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ .. చిత్ర పరిశ్రమలో రాజకీయాలు ఎంతో సైలెంట్ గా ఉంటాయి .. అలాగే చాలా లోతుగా కూడా అవి జరుగుతూ ఉంటాయి .. ఈ రాజకీయాలకు ఇండస్ట్రీ ఎంతగానో ఇబ్బంది పడుతూ నలిగిపోతుంది ఇప్పటికైనా సరే నిర్మాతలు గాని .. డిస్ట్రిబ్యూటర్స్ కానీ ... ఎగ్జిబిటర్స్ కానీ ఇది గ్రహించాలి .. మన చిత్ర పరిశ్రమ నుంచి ఎదిగి ఒకరు డిప్యూటీ సీఎం అయినా వాళ్ళనే మనం కోపం తెప్పించుకునే విధంగా చేసామంటే .. మన ఐక్యమత్యం ఎలా ఉంది అనేది మనమే ఒకసారి ప్రశ్నించుకునే సమయం వచ్చింది .. అంటూ బన్నీ వాసు సోషల్ మీడియా వేదికగా తన ఆగ్రహం వ్యక్తం చేశారు .. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో మరింత హాట్ టాపిక్ గా మారాయి ..


మరింత సమాచారం తెలుసుకోండి: