- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

య‌నిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ .. ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు .. సందీప్ రెడ్డి య‌నిమల్ సినిమాలో చిన్న పాత్ర చేసిన  భారీ క్రేజ్ తెచ్చుకుంది .. ఈ సినిమాతోనే ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా అవతరించింది .. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస‌ సినిమా అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీగా మారిపోయింది .. ఇక ఇప్పుడు ప్రభాస్ , డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న స్పిరిట్ సినిమాలో భారీ అవకాశం అందుకుంది .. ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతుంది త్రిప్తి డిమ్రీ .. అంతేకాదు పాన్ ఇండియా సూపర్ స్టార్‌ తో కలిసి ఈ నటించబోతున్న తొలి సినిమా కూడా ఇదే . అయితే స్పిరిట్ సినిమాకి ముందుగా దీపికా పదుహనేని హీరోయిన్గా అనుకున్నారు .. కానీ చివరకు ఆమె ప్లేస్ లోకి త్రిప్తి డిమ్రీ వచ్చి చేరింది .. 


అయితే స్పిరిట్ ఆఫర్ రావడంతో త్రిప్తి డిమ్రీ తన రెమ్యూనరేషన్ ను పెంచేసినట్టుగా టాక్ .. గతంలో ఒక్కో సినిమాకు 40 లక్షల పారితోషికం అందుకుంది .. కానీ య‌నిమల్ సినిమా తర్వాత ఈ అమ్మడి క్రేజ్ మరింత పెరిగింది దీంతో అవకాశాలు రావడంతో నెమ్మదిగా రెమ్యునరేషన్ పెంచుకుంటూ వెళ్లింది .. అయితే ఇప్పుడు స్పిరిట్ సినిమా కోసం త్రిప్తి ఏకంగా ఐదు కోట్లు అందుకుంటున్నటు టాక్‌ .. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది .  డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం .. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగ‌ రాబోతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ హైప్ నలుపున్నాయి .. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించబోతున్నారు .. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లోకి రానుందని అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: