
ఇక ఎప్పుడైతే జైలర్ 2 లో నాగార్జున అనే వార్త బయటకు వచ్చిందో .. అప్పటినుంచి బాలయ్య , నాగార్జున ఓకే ఫ్రేమ్లో కనిపిస్తారా ? కనిపిస్తే ఎలా ఉండబోతుంది ? అనే చర్చ గట్టిగా మొదలైంది .. ఇక బాలయ్య , నాగార్జున ఇప్పటివరకు ఒక సినిమాలో కూడా కలిసి నటించలేదు .. అలాగే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉంది అంటూ టాక్ వస్తుంది .. అలాగే ఇద్దరికి పడటం లేదని మాట్లాడి కోరని ఒకరి ప్రస్తావన మరొకరి దగ్గరకు తీసుకురారని టాలీవుడ్ వర్గాలు చెబుతూ ఉంటాయి .. బాలయ్య ఇటీవల చేసిన కొన్ని ముఖ్యమైన వేడుకలకు సైతం నాగార్జున రాలేదు .. అలాగే అఅన్ స్టాపబుల్ ల్లో నాగార్జున ప్రస్తావన కూడా లేదు .. నాగార్జున ఈ షో కి వెళ్ళలేదు నాగార్జున చేస్తున్న బిగ్ బాస్ షో లోను బాలయ్య అడుగు పెట్టలేదు .. ఇలాంటిది వీరిద్దరూ ఒకే సినిమాలో ఎలా కనిపిస్తారు అన్నది ఇప్పుడు అంతు చికిని ప్రశ్నగా మారింది .
అయితే జైలర్ 2లో నాగార్జున , బాలయ్య నటించిన కలిసి కనిపించే ఒక్క ఫ్రేమ్ కూడా ఉండదని తెలుస్తుంది .. ఇక జైలర్ లో మోహన్లాల్ , శివరాజ్ కుమార్ ఇదరు నటించారు కానీ ఒక ఫ్రేమ్లో కూడా ఇద్దరూ రాలేదు . ఇప్పుడు ఈసారి కూడా అంతే అని తెలుస్తుంది .. అయితే నాగార్జునది ఫుల్ లెంగ్త్ రోల్ అని ఆయనే మెయిన్ విలన్ అని కూడా అంటున్నారు .. రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకుబోతున్నారు .. కూలి , కుబేర సినిమాలకు నాగార్జున గట్టిగానే అందుకున్నారు .. ఇలా నాగార్జున హీరోగా నటించేటప్పుడు అందుకున్న పారితోషికం కంటే ఇది ఎక్కువట .. దీన్నిబట్టి నాగార్జునకి ఈ బారాలే బాగా కలిసి వస్తున్నాయన్నమాట..