
ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో నిర్మాత సి.కళ్యాణ్ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఈ సినిమాను చంపింది ఎవరో తెలుసా? మహేష్ అభిమానులే.. మహేష్ కామెడీ చేస్తే వాళ్లకు అర్థం కాలేదు. నాతో తాగి ఫోన్లు చేసి బూతులు తిట్టారు. డైరెక్టర్ త్రివిక్రమ్ ను కూడా నీకు సినిమా తీయడం రాదా? అంటూ అనేశారు. ఇవాళ అదే ఫ్యాన్స్ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు అంటూ నవ్వుతూ వెల్లడించారు.
దాదాపు పదిహేనేళ్ల తర్వాత 'ఖలేజా'ను మళ్ళీ థియేటర్లకు తీసుకురావడం విశేషం. మే 31న కృష్ణ జయంతిని పురస్కరించుకుని, మే 30న ఈ సినిమాను 4K ఫార్మాట్ లో గ్రాండ్ గా రీ-రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ సినిమా బోలెడు హైప్ క్రియేట్ చేస్తోంది. విడుదలకు ముందే రూ.5 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించడం దీని పాపులారిటీకి నిదర్శనం. ఈ సినిమాకి అప్పట్లో నిరాసక్తత చూపిన అభిమానులు ఇప్పుడు విపరీతంగా స్పందిస్తున్నారు. ‘ఖలేజా’ సినిమా కాలాన్ని మించి ముందుకు సాగిపోయిన సినిమా అన్న ఫీల్ ఇప్పుడు ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ మార్క్ హ్యూమర్, మహేష్ నటన, అనుష్క శెట్టి గ్లామర్ ఇలా అన్ని ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా చూస్తే, ఒకప్పుడు ఎదురైన వ్యతిరేకత ఇప్పుడు ప్రేమగా మారింది. ‘ఖలేజా’ రీ-రిలీజ్ ద్వారా అప్పటి అభిప్రాయాలు ఎలా మారాయని మరోసారి నిరూపితమవుతోంది.