
ఇంకేముంది దర్శకనిర్మాతలు సైతం ట్రెండ్ ను ఫాలో అవుతూ పాత చిత్రాలను వరుస పెట్టి మళ్ళీ విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో ఈ రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. థియేటర్స్ లో పాత తెలుగు చిత్రాలు రఫ్ఫడిస్తున్నాయి. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన `ఖలేజా` చిత్రం రీ రిలీజ్ అయ్యి ఎలాంటి హంగామా సృష్టించిందో తెలిసింది. నిజానికి 2010లో విడుదలైన ఖలేజా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. కానీ రీ రిలీజ్ లో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ తో భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇంకా చెప్పాలంటే అదే రోజు కొత్త వచ్చిన `భైరవం` సినిమాను గట్టి దెబ్బ కొట్టింది. ఈ సంగతి పక్కన పెడితే.. ఇప్పటివరకు తెలుగులో రీ రిలీజ్ అయిన చిత్రాల్లో కలెక్షన్స్ పరంగా టాప్-10 మూవీస్ ఏవి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
టాప్-10 సినిమాల టోటల్ వరల్డ్ వైడ్ రీ రిలీజ్ కలెక్షన్స్ రిపోర్ట్:
1. ఖలేజా(4కె) - రూ. 10.10 కోట్లు (3 రోజులు)
2. మురారి - రూ. 8.90 కోట్లు
3. గబ్బర్ సింగ్ - రూ. 8.01 కోట్లు
4. ఖుషి - రూ. 7.46 కోట్లు
5. ఆర్య 2 - రూ. 6.75 కోట్లు
6. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - రూ. 6.60 కోట్లు
7. బిజినెస్‌మ్యాన్ - రూ. 5.85 కోట్లు
8. ఆరెంజ్- రూ. 4.71కోట్లు(2వ రీ రిలీజ్ – 1.35కోట్లు)
9. సింహాద్రి - రూ. 4.60 కోట్లు
10. సలార్ - రూ. 4.35 కోట్లు