మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం `మాస్ జాతర` మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 27న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. అయితే ఇంతలోనే రవితేజ మరో ప్రాజెక్ట్ ను లైన్‌లో పెట్టాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నెక్స్ట్ ప్రాజెక్ట్ `RT76` వర్కింగ్ టైటిల్ తో పట్టాలెక్కబోతోంది. ఈ చిత్రానికి `అనార్కలి` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ ఆషికా రంగనాథ్‌ను హీరోయిన్ గా ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి.


మొద‌ట క‌థానాయికి పాత్ర కోసం కయాదు లోహర్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. కానీ ఆమె డేట్స్ దొర‌క్క‌పోవ‌డంతో.. తాజాగా మేకర్స్ ఆషికా రంగ‌నాథ్‌ను ఫిక్స్ చేశార‌ట‌. క‌న్న‌డ‌లో బిజీ బ్యూటీ అయిన ఆషికా.. `అమిగోస్` మూవీతో తెలుగు ఇండ‌స్టీలోకి అడుగు పెట్టింది. ఆ త‌ర్వాత `నా సామిరంగ`లో యాక్ట్ చేసింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. అయిన‌ప్ప‌టికీ చిరంజీవి `విశ్వంభ‌ర`లో అవ‌కాశం ద‌క్కించుకుంది.
తాజాగా ర‌వితేజ `అనార్క‌లి`గా కూడా ఖ‌రారు అయిన‌ట్లు వార్త‌లు రావ‌డంతో.. సినీ ప్రియులు జోడి అదిరిపోయింద‌ని, గుడ్ ఛాయిస్ అని అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాగా, ఎస్ఎల్‌వి సినిమాస్ నిర్మిస్తున్న  ఈ సినిమాలో మ‌రొక హీరోయిన్ కు స్కోప్ ఉంటుంద‌ట‌. ఆ పాత్ర కోసం రీసెంట్ గా `సింగిల్‌` మూవీలో హిట్ అందుకున్న కేతిక శ‌ర్మ‌ను తీసుకున్నార‌ని టాక్‌.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: