
పైన ఫోటోలో కనిపిస్తున్న హీరో మారెవరో కాదు మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ .. ఈ స్టార్ హీరో మలయాళ ప్రేమమ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. సాయి పల్లవి హీరోయిన్గా నటించిన ప్రేమమ్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు నివిన్ పౌలీ .. అలాగే మలయాళం లో ఎన్నో విభిన్నమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నా నివిన్ పౌలీ.. ఇప్పుడు తాజాగా రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న బెంజ్ సినిమాలో విలన్ గా మారిపోయి కనిపించనన్నాడు . ఈ సినిమాలో నివిన్ పౌలీకి సంబంధించిన లుక్ ను రిలీజ్ చేశారు . ఈ మూవీలో వాల్టేర్ అనే పాత్రలో నివిన్ పౌలీ కనిపించనన్నాడు .
అలాగే రాఘవ లారెన్స్ నటిస్తున్న ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు .. ఈ సినిమా కూడా లోకేష్ యూనివర్స్ లో భాగంగా రాబోతుంది .. లోకేష్ డైరెక్షన్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు కూడా ఉన్నాయి .. అలాగే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు . అదే విధంగా ఈ సినిమా అప్డేట్స్ కోసం కూడా ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు .. ఇప్పటికే తాజాగా ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ పరిచయం చేస్తూ వచ్చిన పోస్టర్ సినిమా పై అంచనాలు పెంచేసింది . అలాగే వాల్టేర్ గా నివిన్ పౌలీ లుక్ ఎంతో పవర్ఫుల్ గా ఉంది . ఈ సినిమాను కూడా లోకేష్ పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తీసుకురాబోతున్నారు .