తెలుగు సినిమాలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మల్లో రాశి ఖన్నా ఒకరు. గ‌త కొన్నేళ్ల నుండి హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా హిందీ, తమిళ్ భాషల్లో రాశి ఖ‌న్నా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకుల‌ను అలరిస్తుంది. తెలుగులో చివరిగా 2022లో `థాంక్యూ` మూవీతో పలకరించింది.
సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత టాలీవుడ్ వైపు చూసింది లేదు. దాదాపు రెండేళ్ల గ్యాప్ అనంత‌రం తెలుగులో రాశి ఖ‌న్నా ఓ మూవీకి సైన్ చేసింది. అదే `తెలుసు కదా`. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కింద టి.జి.విశ్వ ప్రసాద్ మరియు వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేస్తున్నారు.
రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లు కాగా.. నీరజ కోన ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు తీసుకున్నారు. ఈ రొమాంటిక్ డ్రామా 2025 అక్టోబర్ 17న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌బోతుంది. అలాగే బాలీవుడ్ లో కూడా రాశి ఖ‌న్నా ఓ మూవీ చేస్తోంది.
ఇక‌పోతే తాజాగా ఓ అవార్డు పంక్ష‌న్‌లో పాల్గొన్న‌ రాశి ఖన్నా.. బ్లాక్ డ్రెస్ లో మిస్మ‌రైజ్ చేసింది. కిల్లింగ్ లుక్స్ తో కుర్రాళ్ల మ‌తి చెడ‌గొట్టింది. ఓవైపు థై అందాలు.. మ‌రోవైపు ఎద సొగ‌సుల‌ను చూపిస్తూ ఫోటోల‌కు పోజిచ్చింది.
బ్లాక్ డ్రెస్ లో రాశి ఖ‌న్నా హాట్‌నెస్ స‌మ్మ‌ర్ హీట్ ను మ‌రింత పెంచేసింది. ప్ర‌స్తుతం నెట్టింట ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు తెగ వైర‌ల్ అవుతుండంగా.. నెటిజ‌న్లు సూప‌ర్‌, హాట్ అంటూ లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు.
వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు



మరింత సమాచారం తెలుసుకోండి: