- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో భారీ కామెడీ మూవీ రాబోతుంది .. అయితే ఈ సినిమా లో ఇంటర్వెల్  సీక్వెన్స్ కోసం ఓ భారీ సెట్ ను వేస్తున్నారు .  ఇక ఈ సెట్ లో దాదాపు రెండు వారాల పాటు యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కిస్తారట‌ .. ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్  నేతృత్వంలో చిరంజీవి పై ఈ ఫైట్స్ చిత్రీకరిస్తారట .. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమా మొత్తం లోనే హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు .. ప్రస్తుతం చిరంజీవి , నయనతారాల పై ఫ్యామిలీ సన్నివేశాలను తెర‌కెక్కిస్తున్నారు .. ఇక ఈ సన్నివేశాలలో చిరంజీవి కామెడీ ఎపిసోడ్ ఎంతో హైలెట్గా ఉంటుందని కూడా అంటున్నారు . అదేవిధంగా ఈ సినిమా లో ఈ ఎపిసోడ్ కూడా అనిల్ రావిపూడి గత సినిమాలకు మించి ఎంతో కామెడీతో ఉంటుందని అంటున్నారు .  

అలాగే ప్రధానంగా ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ కోసం అనిల్ రావిపూడి తన గ‌త‌ సినిమాలకు భిన్నంగా య‌క్ష‌న్ ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను రూట్ లో ఇంటర్వెల్ బ్లాక్ ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది .. అందుకు తగ్గట్టుగానే భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రస్తుతం  సెట్ వర్క్ జరుగుతుంది .  కాగా ఈ సినిమా గురించి చిరంజీవి ఈ మధ్య మాట్లాడుతూ .. ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక సినిమా అని ఈ మూవీ కథ తనకు ఎంతగానో నచ్చిందని చిరంజీవి ఇప్పటికే చెప్పారు .. అలాగే దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పే సీన్స్ గురించి కూడా మెగాస్టార్ మాట్లాడుతూ సినిమాలో ఆ సన్నివేశాలు గురించి అనిల్ నాకు చెబుతుంటే వింటుంటేనే కడుపుబ్బ నవ్వుతూ ఉండిపోయాను ఈ సినిమా ఖచ్చితంగా అభిమానులకు పెద్ద పండగల ఉంటుంది అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు . అలాగే సాహు గారపాటి చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఈ సినిమా ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు .. 2026 సంక్రాంతి కానుకగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: