కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఇండియన్ సోషల్ థ్రిల్లర్ `కుబేర`. రష్మిక మందన్నా, జిమ్ సర్భ్, దలీప్ తహిల్ తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. జూన్ 20న కుబేర పాన్ ఇండియా స్థాయిలో థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర బృందం ముంబై నుండి ప్రమోషన్స్ షురూ చేసింది.
ఇదిలా ఉండగా.. శేఖర్ కమ్ముల ట్రాక్ రికార్డు, ధనుష్-నాగార్జున-రష్మికల స్టార్డమ్ మరియు సినిమాపై ఉన్న అంచనాలు కారణంగా కుబేర బిజినెస్ పరంగా అదరగొడుతోంది. దాదాపు రూ. 120 కోట్ల బడ్జెట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. డిజిటల్ రైట్స్ రూపంలోనే రూ. 47 కోట్ల ఆఫర్ ను సొంతం చేసుకుందని బలమైన టాక్ ఉంది.
ఇప్పుడు థియేట్రికల్ బిజినెస్ పరంగా కూడా కుబేర మాస్ రచ్చ చేస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఎక్స్‌లెంట్ బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి. ఏపీలో ఏకంగా రూ. 18 కోట్ల రేంజ్ లో కుబేర చిత్రానికి బిజినెస్ జరిగిందని సమాచారం అందుతుంది. ఇది నిజంగా బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు. ఇక అటు తెలంగాణాలో కూడా కుబేర భారీ బిజినెస్ సొంతం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా కుబేర సినిమాను నిర్మించారు. డబ్బు, వ్యవస్థ, అవినీతి ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఇందులో ధనుష్ బిచ్చగాడిగా, నాగార్జున కోటీశ్వరుడిగా కనిపించబోతున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు