రాజమౌళి తర్వాత టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుడు అనగానే గుర్తుకు వచ్చే పేరు అనిల్ రావిపూడి. ఇప్పటివరకు ఈయన ఎనిమిది చిత్రాలను తెరకెక్కించగా.. బాక్సాఫీస్ వద్ద అన్ని సినిమాలు హిట్ గా నిలిచాయి. సినిమా మేకింగ్, ప్రమోషన్స్ విషయంలోనే కాదు షూటింగ్ పరంగా కూడా అనిల్ రూటే సపరేటు. ఒక్కసారి సినిమా సెట్స్ మీదకు వెళ్ళిందంటే జెట్ స్పీడులో షూటింగ్ ను పూర్తి చేయడంలో అనిల్‌ రావిపూడి మహా దిట్ట. `సంక్రాంతికి వస్తున్నాం` మూవీతో ఈ ఏడాదిని గ్రాండ్ గా ప్రారంభించిన అనిల్ రావిపూడి.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో `మెగా 157` వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.


ఇందులో నయనతార హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి మరియు సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కాబోతుంది. మెగా 157 సెకండ్ షెడ్యూల్ రీసెంట్ గా ఉత్తరాఖండ్ లోని ముస్సోరీలో ప్రారంభ‌మైంది. అక్క‌డ చిరంజీవిపై కొన్ని కీలకమైన మరియు వినోదాత్మక సన్నివేశాలను షూట్ చేస్తున్నాయి.


ఇక‌పోతే అనిల్ రావిపూడి వర్కింగ్ స్టైల్, అత‌ని ప‌ర్ఫెక్ట్‌ ప్లానింగ్ చిరంజీవిని ఎంత‌గానో ఇంప్రెస్ చేస్తున్నాయ‌ట‌. ఈ నేప‌థ్యంలోనే అనిల్ కు మ‌రో మూవీ ఛాన్స్ ఇవ్వాల‌ని చిరు భావిస్తున్నార‌ట‌. బ‌ట్ కండీష‌న్ అప్లే. తాజా చిత్రంతో చిరంజీవికి అనిల్ రావిపూడి హిట్ ఇస్తేనే.. ఆయ‌న‌కు మ‌రో సినిమా చేసే అవ‌కాశం మెగాస్టార్ నుండి ల‌భిస్తుందని టాక్ న‌డుస్తోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాల్సి ఉంది. కాగా, అనిల్ రావిపూడి ఇప్ప‌టికే టాలీవుడ్ సీనియ‌ర్ స్టార్స్ లో వెంకీ, బాల‌య్య‌తో సినిమాలు చేసేశారు. ఇప్పుడు మెగా 157తో చిరును డైరెక్ట్ చేస్తున్నారు. ఇక అనిల్ లిస్ట్ లో నెక్స్ట్ నాగార్జునే ఉన్నారు. మ‌రి వీరి కాంబో ఎప్ప‌టికి సెట్ అయ్యేనో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: